పింక్ చుడీదార్ లో సీనియర్ నటి గ్లామర్ మెరుపులు! కొత్త ఇల్లు కొన్న ఆనందంలో త్రిష కృష్ణన్? అన్ని కోట్లా!

First Published | Jan 21, 2023, 4:49 PM IST

సీనియర్ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రెడ్ చుడీదార్ లో కట్టిపడేస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత కేరీర్ లో మరింత స్పీడ్ పెంచిన కుందవై గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి.
 

తమిళ బ్యూటీ, సీనియర్ హీరోయిన్  త్రిష కృష్ణన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం. టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన ముద్ర వేసుకుంది.  సౌత్ లోని సీనియర్ మోస్ట్ హీరోయిన్ దూసుకెళ్తోంది. 
 

రీసెంట్ గా 20 ఏండ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న త్రిష ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. గతేడాది విడుదలైన తమిళ బాహుబలి చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో  కుందవైగా అలరించింది. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్సాన్స్ వచ్చింది.
 


ఒక రకంగా చెప్పాలంటే PS1తో త్రిష కేరీర్ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందని తెలుస్తోంది. మరోవైపు త్రిషకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ కొత్త ఇల్లును కూడా కొందని ప్రచారం జరుగుతోంది. 
 

చెన్నైలోని  తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంటికి సమీపంలోనే త్రిష కొన్న ఇల్లు ఉందని తెలుస్తోంది. ఆ ఇంటికి రూ.5 కోట్ల విలువ ఉంటుందని తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎందుకు కొనుగోలు చేసిందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ గా మారుతోంది.
 

ప్రస్తుతం సతురంగ వేట్టై పార్ట్ 2, రామ్ పార్ట్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత నెలలో త్రిష నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా విడుదలై ఆకట్టుకుంది. త్రిష చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉందని తెలుస్తోంది. 
 
 

స్టార్ హీరో విజయ్ దళపతి - లోకేష్ కనగరాజు కాంబోలో తెరకెక్కుతున్న Thalapathy67లోనూ నటించే ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైందట. ఇక అజిత్ కుమార్ 62వ మూవీలో త్రిష ఉందని అంతా భావించినా.. ఆమెకు బదులు నయనతారా, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.

Latest Videos

click me!