Trisha : దళపతి విజయ్ కోసం స్టార్ హీరోయిన్‌తో త్రిష గొడవపడిందా? నిజమెంత?

Published : May 03, 2026, 03:28 PM IST

దళపతి విజయ్ సరసన వరుసగా నటిస్తున్న మరో హీరోయిన్‌తో త్రిష  గొడవపడిందా?   హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే త్రిష ఈ పని చేసిందని ఓ  వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత? 

PREV
18
24 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో..

హీరోయిన్  త్రిష కేవలం తమిళంలోనే కాదు, సౌత్ ఇండియా మొత్తం మీద గత 24 ఏళ్లుగా హీరోయిన్‌గా రాణిస్తుంది. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా.. 40 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది త్రిష.  '96', 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' వంటి చిత్రాలు ఆమెను మళ్లీ లైమ్‌లైట్‌లోకి తెచ్చాయి.

28
హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి

హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ త్రిష మాత్రం హీరోయిన్ గానే రీ ఎంట్రీ ఇచ్చి.. సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.  ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా, తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది త్రిష. అయితే ఇటీవల 'థగ్ లైఫ్' సినిమాలో ఆమె పాత్రపై చాలా విమర్శలు వచ్చాయి.

38
త్రిష - విజయ్:
త్రిష కెరీర్ అద్భుతంగా సాగుతున్నా, ఆమె వ్యక్తిగత జీవితం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక, వీరిద్దరిపై వదంతులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే, విజయ్ కోసం త్రిష ఒక స్టార్ హీరోయిన్‌తో గొడవపడ్డారనే పాత వార్త మళ్లీ తెరపైకి వచ్చింది.
48
అసిన్ ‌- త్రిష మధ్య గొడవ?

త్రిష, అసిన్ దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరూ స్టార్ హీరోలతో వరుస హిట్లు కొట్టడంతో, వారి మధ్య పోటీ, గొడవలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ముఖ్యంగా, విజయ్ 'తిరుప్పాచ్చి'లో త్రిష, 'శివకాశి'లో అసిన్ నటించడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 'పోకిరి', 'కావలన్' చిత్రాల్లోనూ విజయ్‌తో అసిన్ నటించడంతో త్రిష ఆమెతో గొడవపడిందని గుసగుసలు వినిపించాయి. 

58
వదంతులపై త్రిష క్లారిటీ..

అయితే, అసిన్ తర్వాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టి, పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. దీంతో వారి మధ్య గొడవలపై చర్చ తగ్గింది. ఈ రూమర్స్ పై త్రిష ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, 'అసిన్‌తో నాకు ఎలాంటి గొడవా లేదు. అదంతా వట్టి పుకారు మాత్రమే. అసిన్‌తోనే కాదు, ఏ హీరోయిన్‌తోనూ నాకు గొడవలు జరగలేదు' అని స్పష్టం చేశారు.

68
అసిన్ గురించి త్రిష మాట్లాడుతూ..
'వర్షం' సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకున్నప్పుడు నేను మొదటిసారి అసిన్‌ను కలిశాను. అప్పుడు ఆమె నన్ను అభినందించారు. మేమిద్దరం ఒకేలాంటి పాత్రలు చేయడంతో, మా మధ్య పోటీ ఉందని మీడియానే సృష్టించింది. నేను విజయ్‌తో ఒక సినిమా చేస్తే, తర్వాతి సినిమాలో అసిన్ చేసేవారు. కానీ దాన్ని నేనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు' అని త్రిష వివరించారు.
78
కట్టు కథ అని కొట్టిపారేసిన త్రిష

 త్రిష మాట్లాడుతూ, 'మా మధ్య వ్యక్తిగత పరిచయం కూడా లేదు. కానీ ఆమె చాలా ప్రొఫెషనల్' అని అసిన్‌ను మెచ్చుకున్నారు. మొత్తానికి చాలా ఏళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ గొడవ నిజం కాదని.. ఎవరో  సృష్టించిన కట్టుకథ అని త్రిష స్పష్టం చేశారు.

88
చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్
ప్రస్తుతం త్రిష 'కరుప్పు', 'విశ్వంభర', 'రామ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్‌తో కలిసి ఓ కొత్త సినిమాకు కూడా సైన్ చేశారు.
Read more Photos on
click me!

Recommended Stories