బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదని అందరూ అనుకున్నారు. కానీ, దురందర్ 2 ఆ అంచనాలను తలకిందులు చేసింది. విడుదలైన 45 రోజుల్లోనే ఈ సినిమా ఊహించని రేంజ్‌లో వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సరికొత్త చరిత్రను సృష్టించింది ధురంధర్ 2 సినిమా. ఈ మూవీ రిలీజై 45 రోజులు దాటినా థియేటర్లలో ఇంకా బలంగా నడుస్తోంది. మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా దీని జోరు తగ్గలేదు. 45వ రోజైన ఏడో శనివారం నాడు ఈ సినిమా సుమారు రూ.2.77 కోట్లు వసూలు చేసింది.
24
దురందర్ 2 వసూళ్ల వివరాలు
బాలీవుడ్ సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.1,138.54 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక గ్రాస్ వసూళ్లు చూసుకుంటే, ఆ మొత్తం రూ.1,362.57 కోట్లకు చేరింది. ఈ నంబర్లు చూస్తుంటే, 2026లో వచ్చిన అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోవడం ఖాయం. ఓవర్సీస్‌లోనూ సినిమా హవా తగ్గలేదు.
34
దురందర్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
విదేశాల్లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.425.75 కోట్లు వసూలు చేసింది. రోజువారీ వసూళ్లు కాస్త తగ్గినా, భారత థియేటర్లలో సినిమా పట్టు ఇంకా బలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.1,788.32 కోట్లకు పెరిగాయి. ఈ ఫీట్‌తో, దంగల్ తర్వాత రూ.1,800 కోట్ల క్లబ్‌లో చేరబోయే రెండో భారతీయ సినిమాగా దురందర్ 2 నిలవనుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా, దురందర్ 2 సినిమా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,788.06 కోట్లు వసూలు చేయగా, దురందర్ 2 కేవలం 45 రోజుల్లోనే రూ.1,788.32 కోట్లకు చేరుకుంది. తేడా చాలా తక్కువే అయినా, ఈ విజయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త చరిత్రను సృష్టించింది.