Trisha: సీఎం విజయ్ కే కాదు.. మరో హీరోకి కూడా లక్కీగా మారిన త్రిష, అసలు విషయం ఏంటంటే?

Published : May 21, 2026, 06:05 PM IST

త్రిష ప్రస్తుతం తమిళనాడులో అదృష్ట దేవతగా మారిపోయింది. ఆమె కాలు పెడితే చాలు హీరోలకు తిరుగులేని సక్సెస్ లు అందుతున్నాయి. రీసెంట్ గా ఆమె వల్లే విజయ్ సీఎం అయ్యాడని టాక్ గట్టిగా నడుస్తుండగా.. మరో హీరోకి కూడా త్రిష వల్ల భారీ విజయం లభించింది.

PREV
16
ఫుల్ జోష్ లో ఉన్న త్రిష కృష్ణన్..

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆమె వల్లే దళపతి విజయ్ సీఎం అయ్యారని వార్తలు వైరల్ అవుతున్న వేళ.. మరో హీరో సూర్యకు కూడా త్రిష వల్లే హిట్టు పడిందని అభిమానులు అంటున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అచ్చం ఆయన భార్యలాగే త్రిష రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు మే నెలలో మరో సక్సెస్ ఉందని ఆమె చెప్పడంతో అసలు విషయం ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

26
ఒకరికి విజయ దేవత.. మరొకరికి లక్కీ గర్ల్..!

త్రిష కృష్ణన్‌ దశ తిరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె టైం నడుస్తోంది. దళపతి విజయ్ రాజకీయాల్లో గెలవడానికి త్రిష అదృష్టమే కారణమని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఇదే సమయంలో, సూర్యతో కలిసి ఆమె నటించిన 'కరప్పు' సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు విజయాల తర్వాత, మే నెలలో ఇంకో సక్సెస్ కూడా ఉందని త్రిష చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఆ మూడో విజయం ఏంటి?

36
త్రిష జాతకంలో రాజయోగం..?

బహుశా త్రిష జాతకంలో ఇప్పుడు రాజయోగం నడుస్తున్నట్టుంది. ఆమెను విజయ్ పాలిట 'విజయ దేవత' అని పిలుస్తున్నారు అభిమానులు.. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే త్రిష పుట్టినరోజు కూడా కావడం. ఆ రోజు ఆమె తిరుపతి వెళ్లి విజయ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆమె చెన్నైకి తిరిగి వచ్చేసరికి దళపతి గెలిచారన్న వార్త తెలిసింది. విజయ్ ప్రమాణ స్వీకారం రోజు త్రిష పట్టుచీర కట్టి, మల్లెపూలు పెట్టుకుని కనిపించారు. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.

46
ప్లాప్ ల నుంచి బయటపడ్డ హీరో..

గత కొన్నేళ్లుగా సూర్యకు హిట్లు లేదు.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదుురుచూస్తుండగా.. త్రిషతో కలిసి నటించడంతో సూర్య ఫ్లాపుల పరంపరకు బ్రేక్ పడింది. గత వారం సూర్య, త్రిష కలిసి నటించిన 'కరప్పు' సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ఇప్పటివరకు 160 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

56
మూడో విజయం ఏంటబ్బా..?

ప్రస్తుతం 'కరప్పు' సక్సెస్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన త్రిష, "మే నెలలో రెండు విజయాలు వచ్చాయి. ఇంకొకటి మిగిలి ఉంది" అని రాసుకొచ్చారు. ఒకటి దళపతి విజయ్ రాజకీయ విజయం, రెండోది సూర్య సినిమా విజయం. మరి మిగిలి ఉన్న ఆ మూడో విజయం ఏంటబ్బా అని జనాలు తలలు పట్టుకుంటున్నారు.

66
త్రిష రాజకీయ ప్రవేశం ..?

విషయం ఏంటంటే, దళపతి విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలిచారు. అందులో తిరుచ్చి స్థానానికి రాజీనామా చేసి, అక్కడి నుంచి త్రిషను పోటీకి నిలబెడతారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి చూస్తే, త్రిషకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. సో, త్రిష చెప్పిన మే నెల మూడో సక్సెస్ ఇదేనా? ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి రాబోయే రోజుల్లో.. త్రిష ఎలాంటి సక్సెస్ న్యూస్ చెబుతారో చూడాలి

Read more Photos on
click me!

Recommended Stories