Karuppu 6 Days Collections: ఆరో రోజూ ఆగని సూర్య జోరు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కరుప్పు`

Published : May 21, 2026, 05:44 PM IST

Karuppu 6 Days Collections: చాలా ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. 

PREV
14
బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న కరుప్పు

సూర్య కెరీర్‌లో అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ థియేట్రికల్ హిట్, ఇప్పుడు కరుప్పు సినిమాతో నిజమైంది. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా, కలెక్షన్ల పరంగా పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన 'కరుప్పు', ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్యతో పాటు త్రిష, ఇంద్రన్స్, నట్టి నటరాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

24
అడ్డంకులు దాటుకొని దూసుకుపోతున్న కరుప్పు

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయ్ అభ్యంకర్ సంగీతం అందించారు. కోర్టు నేపథ్యం, సామాజిక అంశాలు, దైవభక్తి, అభిమానులను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఉండటం సినిమాకు ప్రత్యేక ఆదరణను తెచ్చిపెట్టింది. మే 14న విడుదల కావాల్సిన 'కరుప్పు', చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల వల్ల ఒకరోజు ఆలస్యమైంది. దీంతో అభిమానులు ఆందోళన చెందగా, దర్శకుడు ఆర్.జె. బాలాజీ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ మే 15న సినిమా థియేటర్లలోకి వచ్చాక, ఆ నిరాశ మొత్తం సంబరంగా మారిపోయింది.

34
కరుప్పు వసూళ్ల వేట

మొదటి రోజు నుంచే థియేటర్లలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా "కరుప్పన్" గెటప్‌లో సూర్య కనిపించే సన్నివేశాలకు అభిమానులు నుంచి భారీ స్పందన వస్తోంది. చాలామంది "ఇదే సూర్య అసలైన కమ్‌బ్యాక్" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కలెక్షన్ల పరంగా కూడా 'కరుప్పు' కోట్లు కొల్లగొడుతోంది. మొదటి మూడు రోజుల్లో 147 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేసిందని తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో రూ.12.67 కోట్లు, కర్ణాటకలో రూ.1.33 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.1.87 కోట్లు వసూలు చేసింది 'కరుప్పు'.

44
200 కోట్లకు చేరువలో కరుప్పు

చాలా సంవత్సరాల తర్వాత సూర్య-త్రిష జోడీ మళ్లీ తెరపై కనిపించడం కూడా అభిమానులకు అదనపు ఆకర్షణగా నిలిచింది. అలాగే సాయ్ అభ్యంకర్ నేపథ్య సంగీతం, ఎమోషనల్ మాస్ సీన్స్ సినిమా విజయానికి  బలంగా నిలిచాయి. వారాంతాల్లోనే కాకుండా పనిదినాల్లో కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో, త్వరలోనే 'కరుప్పు' రూ.200 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరవచ్చని సినీ వర్గాల్లో అంచనాలున్నాయి. ఒకరోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వేగంగా దూసుకెళ్తూ సూర్యకు ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories