పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ.. ఓ సారి ఓ ఈవెంట్ లో బిర్యాని ఆఫర్ చేసి.. ఇంటికి పిలిచిన అమ్మాయికి ప్రభాస్ ఏమని సమాధానం చెప్పాడో తెలుసా?
టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు ప్రభాస్. 50 ఏళ్లు వస్తున్నా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ కు డైహార్ట్ అభిమానులు ఎక్కువ.. అందులోను లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతూ వచ్చే మహిళా అభిమానుల సంఖ్య ఎక్కవనే చెప్పాలి. ఇక ప్రభాస్ ను చూస్తే చాలు.. మాట్లాడితే చాలు, ఫోటో దిగితే ఇంక ఏం అక్కర్లేదు అని కలలు కంటుంటారు కొంత మంది అభిమానులు. అటువంటి వారికి ప్రభాస్ ను కలిచే ఛాన్స్ వస్తే..? అలాంటి అవకాశాన్ని వదులుకుంటారా?.
25
ప్రభాస్ ను భోజనానికి పిలిచిన అభిమాని..
అప్పుడప్పుడు అభిమానులతో ప్రోగ్రామ్స్ ద్వారా కనెక్ట్ అవుతుంటాడు ప్రభాస్. అలానే ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడిన ప్రభాస్.. చాలా విషయాలను పంచుకున్నారు. తన ఇష్టా ఇష్టాలను లేడీ అభిమానులకు వెల్లడించాడు. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ.. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగింది. ప్రభాస్ చాలా రకాలు తింటాను..ఎప్పుడుఏది ఇష్టం అంటే చెప్పలేను అని అన్నాడు. అయితే నేను బిర్యానీ చేసి పెడతాను.. మా ఇంటికి వస్తావా అని అడిగింది. దానికి సమాధానం చెపుతూ.. ప్రభాస్.. తప్పకుండా వస్తాను. పక్కాగా వస్తాను.. కానీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు పిలవండి.. ఏదైనా షూటింగ్ లో ఉంటే మాత్రం రావడం సాధ్యం కాదు.. రాలేను అని ప్రభాస్ అన్నారు. అలా ఇంటికి భోజనానికి వస్తానని ప్రభాస్ అనడంతో.. ఆ అమ్మాయిన సంతోషం తట్టుకోలేకపోయింది.
35
ప్రభాస్ భోజన ప్రియుడు..
ప్రభాస్ భోజన ప్రియుడు. ఆయన భోజనంలో నాన్ వెజ్ వెరైటీలు ఉండాల్సిందే. మటన్, చేపల పులుసు, రొయ్యలు, నాటు కోడి ఇలా రకరకాల వెరైటీలతో రాజుల భోజనం చేస్తుంటారు. అంతే కాదు తనచుట్టు ఉండేవారు కూడా అదే భోజనం చేయాలని ఆయన కోరుకుంటాడు., ప్రభాస్ తో షూటింగ్ ఉంటే.. సెట్ లో ఉన్న టీమ్ అందరికి పండగే. ప్రభాస్ భోజనం తిని ఎంతో మంది స్టార్స్ గొప్పగా తలుచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంటికి వచ్చినవారికి కడుపునిండా భోజనం పెట్టందే పంపించడట ప్రభాస్.
నిజానికి పాన్ ఇండియా హీరోగా చాలా ప్లాప్ లు ఫేస్ చేశాడు ప్రభాస్. వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నా.. ఎక్కడా ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వలేదు. ఆయన అభిమనులు తగ్గలేదు. అదే క్రేజ్ తో ఇప్పటికీ దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా.. సరే ఎక్కడ తోణకలేదు. ధైర్యంగా ముందడుగు వేస్తున్నాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈమధ్యే రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ కు భారీ డిజాస్టర్ పడింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు.
55
ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలు..
ప్రస్తుతం హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ కూడా స్టార్ట్ అయ్యింది. అటు కల్కీ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది కానీ.. ప్రభాస్ ఇంకా సెట్స్ లో జాయిన్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తో సినిమా తరువాత ప్రశాంత్ నీల్.. సలార్ 2 ను స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.