సుడిగాలి సుధీర్ `గాలోడు` ఫ‌స్ట్ సింగిల్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్‌.. దూసుకుపోతున్న `నీ కళ్ళే దివాళి`

First Published | Jul 30, 2022, 8:12 PM IST

సుడిగాలి సుధీర్ - గ్లామర్ బ్యూటీ గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’ (Gaalodu). తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవగా ఆడియెన్స్ నుంచి  బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. 

యూత్ స్టార్ సుడిగాలి సుధీర్‍ (Sudigali Sudheer), గెహ్నా సిప్పి (Gehna Sippy) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం `గాలోడు`. ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `గాలోడు` టీజ‌ర్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో 13 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. రాబోయే ఫుల్ లిరిక‌ల్ సాంగ్‌పై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. 
 

తాజాగా `నీ కళ్ళే దివాళి...` (Nee Kalle Diwali) లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.  అదిరిపోయే రెస్పాన్స్‌తో ఇన్‌స్టంట్‌ చార్ట్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ పాట‌లో సుధీర్ డ్యాన్స్‌, ఫారెన్ లొకేష‌న్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో #7లో  ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భీమ్స్ అద్భుత‌మైన ట్యూన్ అందిచగా..  శ్రీ‌నివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చ‌క్క‌గా ఆల‌పించాడు. 
 


సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి అలరించే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆయన శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. ఫ‌స్ట్ సాంగ్‌తో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు. తర్వలోనే గాలోడు విడుద‌ల తేదీని కూడా ప్రకటిస్తామని తెలిపింది చిత్ర యూనిట్. 

చిత్రంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటించగా.. స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీగా సి రాంప్ర‌సాద్‌, సంగీతం: భీమ్స్ సిసిరోలియో ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌గా బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌ వ్యవహరించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మించారు. ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలను రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌ చూసుకున్నారు. 

Latest Videos

click me!