Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌

Published : Aug 28, 2026, 02:15 PM IST

యష్‌ హీరోగా వచ్చిన `టాక్సిక్‌` మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. అయితే ఈ మూవీ విషయంలో దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

PREV
14
టాక్సిక్‌ మూవీకి నెగటివ్‌ టాక్‌

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` మూవీ ఈ బుధవారం విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. సినిమాకి నెగటివ్‌ టాక్‌ వచ్చినా మొదటి రోజు అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. రెండో రోజు భారీగా పడిపోయాయి. అయినా సాలిడ్‌గానే ఉందని చెప్పొచ్చు. ఈ వారాంతం వరకు ఈ మూవీకి కలెక్షన్లు బాగానే ఉంటాయి. డీసెంట్‌ నెంబర్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే ఆ తర్వాత పరిస్థితేంటనేది సస్పెన్స్ గా మారింది. కాకపోతే సినిమాకి అన్ని వర్గాల నుంచి నెగటివ్‌ టాక్‌ వస్తోంది. మూవీ దారుణంగా ఉందని, డిజాస్టర్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో సిగరేట్‌, మందు, అమ్మాయిలతో రొమాన్స్, ఎలివేషన్లు, యాక్షన్‌ సీన్లతోనే సాగుతుందని, మంచి ఎమోషన్స్ లేవని, కథలో క్లారిటీ లేదని, దీంతో డిజప్పాయింట్‌ చేస్తుందని అంటున్నారు.

24
గీతూ మోహన్‌ దాస్‌ కామెంట్స్ దుమారం

`టాక్సిక్‌` కి నెగటివ్‌ టాక్‌ వైరల్‌గా మారుతుంది. చాలా వరకు ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్ర దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకి గీతూ మోహన్‌దాస్‌ ఏం చెప్పిందంటే.. `నేను పేపర్‌ మీద రాసిన కథ ఒకలా ఉంటుంది. కానీ సెట్స్ పైకి వెళ్లాక షూట్ చేసేది మరోలా ఉంటుంది. ఇక ఎడిటింగ్‌ టేబుల్‌పై కూర్చున్నప్పుడు ఎడిట్‌ చేసేది ఇంకొకలా ఉంటుంది. ఆ తర్వాతే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నేను ఎప్పుడూ ఒకే స్క్రిప్ట్ కి కట్టుబడి ఉండను, నా తదుపరి సినిమా కోసం నిర్మాతలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు కూడా నేను ముందు ఇదే చెబుతాను. మీరు పేపర్‌పై ఏ కథనైతే చదువుతారో, స్క్రీన్‌పై మాత్రం కచ్చితంగా అది చూడలేరు అని ముందే స్పష్టంగా చెబుతాను` అని వెల్లడించింది గీతూ మోహన్‌దాస్‌.

34
గీతూ మోహన్‌ దాస్‌పై ట్రోలింగ్‌

టాక్సిక్‌ మూవీ విడుదలకు ముందు ఓ వీడియో ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిప్పుడు వైరల్‌గా మారింది. ట్రోల్స్ కి గురవుతుంది. అయితే గీతూ మోహన్‌ దాస్ కామెంట్స్ చూసి మొదట అంతా ఆశ్చర్యపోయారు. ఆమె కథ మారిపోతుంది, తెరకెక్కించేటప్పుడు సీన్‌ మారిపోతుందంటే.. ఆమె స్థానంలో యష్‌ సినిమాని తెరకెక్కించాడా అనే అనుమానాలు కలిగాయి. కానీ తనే మార్పులు చేస్తానని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. ఇలా చేయడం వల్లే సినిమా పోయిందని, చెప్పిన కథ, తీసిన సినిమా ఒకేలా ఉండి ఉంటే పెద్ద హిట్‌ అయ్యేదేమో అని యష్‌ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు గీతూ మోహన్‌ దాస్‌ కామెంట్స్ మాత్రం పెద్ద రచ్చ అవుతున్నాయి.

44
రెండు వందల కోట్లకు దగ్గరలో `టాక్సిక్‌`

ఇక యష్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` మూవీకి గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించగా, ఇందులో నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమాఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. యష్‌తోపాటు వెంకట్‌ కే నారాయణ నిర్మించారు. సుమారు రూ.500కోట్లకుపైగా బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం రెండు రోజుల్లో రెండు వందల కోట్లకు చేరువలో ఉంది. ఇంకా ఈ మూవీ ఆరువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబడితే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రేంజ్‌కి వెళ్తుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories