Toxic Team Salary: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన మూవీ `టాక్సిక్`. నేడు విడుదలైన ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వస్తుంది. దారుణమైన నెగటివ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఆర్టిస్ట్ లు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా?
యశ్ 'టాక్సిక్' సినిమాలో స్టార్ హీరోయిన్ల లిస్ట్ చాలానే ఉంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన యశ్, మీడియా కథనాల ప్రకారం రూ.50 నుంచి 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని టాక్. అంతేకాదు లాభాల్లో షేర్ కూడా తీసుకోబోతున్నారట. మరి, ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ అందిందో చూద్దాం.
26
కియారా అద్వానీకి 15 కోట్లు
ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం.. 'టాక్సిక్' సినిమాలో నటించినందుకు కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ చిత్రంలో కియారా 'నడియా' అనే పాత్రలో సర్కస్ గర్ల్ గా కనిపించనుంది. యశ్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించింది. ఈమె చుట్టూనే సినిమా హీరో తిరుగుతాడు, సినిమా కథ కూడా తిరుగుతుంది. ఈ సినిమా కోసం నయనతారను మించి కియారానే అత్యధిక పారితోషికం అందుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
36
నయనతారకు 12-18 కోట్లు
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా పేరున్న నయనతార అసలు రెమ్యూనరేషన్ అధికారికంగా బయటకు రాలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 'టాక్సిక్' కోసం నయన్ రూ.12 నుంచి 18 కోట్ల మధ్య తీసుకుని ఉండొచ్చని అంచనా. ఈ సినిమాలో ఆమె 'గంగ' పాత్రను పోషించిన విషయం తెలిసిందే. యశ్ కి అక్క పాత్రలో కనిపించి మెప్పించింది.
'టాక్సిక్' సినిమాలో తారా సుతారియా 'రెబెకా' పాత్రలో నటించింది. యశ్ పై మోజుపడే అమ్మాయి. గ్లామర్ డాల్‌గా కనిపించింది. ఈ సినిమాలో నటించినందుకు తారాకు రూ. 2 నుంచి 3 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
56
హ్యూమా ఖురేషి: 2-3 కోట్లు
'టాక్సిక్' చిత్రంలో హ్యూమా ఖురేషి 'ఎలిజబెత్' పాత్రలో కనిపించనుంది. తన బోల్డ్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న హ్యూమా, ఈ సినిమా కోసం రూ. 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
66
రుక్మిణి వసంత్: 3-5 కోట్లు
కన్నడ లేటెస్ట్ క్రష్ రుక్మిణి వసంత్, 'టాక్సిక్' సినిమాలో 'మెలిస్సా' పాత్రను పోషిస్తోంది. మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా కోసం రుక్మిణికి రూ. 3 నుంచి 5 కోట్ల వరకు పారితోషికం అందినట్లు టాక్. ఇలా యశ్‌తోపాటు హీరోయిన్లకి కూడా భారీగానే పారితోషికం అందడం విశేషం. అయితే సినిమాకి అయిన బడ్జెట్ రూ.500కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. ఈ మూవీకి వెంకట్ కే నారాయణతోపాటు యశ్ కూడా ఓ నిర్మాత కావడం గమనార్హం.