మాతృదేవోభవ, అమ్మ రాజీనామా, ఛత్రపతి, కేజీఎఫ్.. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన టాప్ టెన్ మూవీస్..

First Published | May 14, 2023, 3:37 PM IST

మదర్ సెంటిమెంట్ తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మదర్స్ డే సందర్భంగా ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయిన టాప్ టెన్ సినిమాల గుర్తు చేసుకుందాం. 
 

1991లో వచ్చిన ‘అమ్మ రాజీనామ’ (Amma Rajinama)లో కూడా మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను కదిలించింది. దర్శకరత్న దాసరి నారాయణ డైరెక్ట్ చేశారు. తల్లిపాత్రలో సీనియర్ నటి శారద మెప్పించారు. అప్పటి ప్రేక్షకులకు ఆమె పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోయేలా నటించింది. 
 

1993లో వచ్చిన మాతృదేవోభవ (Matru Devo Bhava) చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతోంది. ముఖ్యంగా చిత్రంలోని వేటూరి రచించిన ‘రాలిపోయే పువ్వా’ సాంగ్  ఇప్పటికీ సంగీత ప్రియులు, తెలుగు ఆడియెన్స్ మదిలోనే పదిలంగా ఉంది.  భారీ రెస్పాన్స్ దక్కింది. దాంతో మలయాళం, హిందీలో రీమేక్ అయ్యింది. చిత్రానికి కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 
 


1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యమలీలా’ (Yamaleela) చిత్రం ఇప్పటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. అలీ, మంజు భార్గవి తల్లికొడుకుల పాత్రలో కన్నీరు పెట్టించారు. చిత్రంలో ఇంద్రజ, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. అలీకి ఇది తొలిచిత్రం. మూవీలోని ‘సిరులొలికించే’ సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ఫేవరేట్ గానే ఉంది.
 

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం మదర్ సెంటిమెంట్ పరంగా ఇప్పటి ఆడియెన్స్ కు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లిపాత్రలో జయసుధ అద్భుతంగా నటించారు. పూరీ తల్లిపాత్రను బాగా చూపించారు. 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలోని ‘నీవే నీవే’ సాంగ్ ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలిచింది. పూరీ దర్శకత్వం వహించారు. 
 

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘ఛత్రిపతి’లోనూ మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. తల్లి కోసం  ప్రభాస్ పడే ఆరాటం అందరినీ కదిలిస్తుంది. సీనియర్ నటి భానుప్రియ తల్లిపాత్రలో జీవించిపోయారు. అందుకే ఇప్పటికీ సినిమాను మరిపోలేరు. ఇప్పటికే కన్నడలో రీమేక్ కాగా, తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలోనూ రీమేక్ అయ్యింది.
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘నాని’ చిత్రం కూడా మదర్ సెంటిమెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమీషా పటేల్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ అందించిన ‘పెదవే పలికినా మాటల్లోనే’ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లోనే ఉంది. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

శర్వానంద్, సుహాసిని తల్లికొడుకులుగా వచ్చిన చిత్రం ‘అమ్మ చెప్పింది’. చిత్రంలో తల్లిప్రేమను చక్కగా చూపించారు దర్శకుడు గంగరాజు గున్నం. శర్వానంద్ నటనకు ప్రశంసలు దక్కాయి. 2006లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ కూడా తల్లిప్రేమను ఎంతో చక్కగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. అమలా అక్కినేని తల్లిపాత్రలో అద్భుతంగా నటించారు. తన నటనతో ఆడియెన్స్ తో కంటతడి పెట్టించారు. 2012లో విడుదలైంది. అభిజిత్, సుధాకర్ కొమకుల, శ్రియా శరన్, విజయ్ దేవరకొండ కీలక నటించారు. 

తమిళం నుంచే వచ్చిన మరో చిత్రం ‘బిచ్చగాడు’ కూడా  తల్లిప్రేమను చక్కగా చూపించింది. తల్లిఆరోగ్యం కోసం ఆంటోని చేసే ప్రతి పని ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తోంది. ఈసారి మరింత గ్రాండ్ గా రాబోతోంది. 
 

కన్నడ చిత్రపరిశ్ర నుంచి వచ్చిన భారీ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ KGF కూడా మదర్ సెంటిమెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అర్చన జోయ్స్ తల్లిపాత్రలో మెప్పించారు. ఆమె చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మదర్ సెంటిమెంట్ ను చక్కగా చూపించారు. రెండో పార్టులోనూ అద్భుతంగా చూపించారు. త్వరలో మూడో పార్ట్ కూడా రాబోతోంది. 
 

తమిళ స్టార్ ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలోనూ మదర్ సెంటిమెంట్ ప్రేక్షకుల హ్రుదయాలను కదిలిస్తోంది. ధనుష్ కు తల్లిపాత్రలో శరన్య జీవించారు. ఇప్పటకీ సోషల్ మీడియాలో మూవీ సీన్స్ వైరల్ గా కనిపిస్తుంటాయి. తల్లిప్రేమను చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Latest Videos

click me!