తమిళ దర్శకుల దెబ్బకు బలైన టాలీవుడ్ హీరోలు.. పవన్, మహేష్ నుంచి రామ్, చైతు వరకు సేమ్ రిజల్ట్

Published : May 14, 2023, 03:12 PM IST

పరభాషా హీరోలు వేరే భాషల్లోకి వెళ్లి నటించడం ఇప్పుడిప్పుడే ఎక్కువవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ కారణంగా హీరోలు అన్ని భాషల్లో నటిస్తున్నారు. అయితే ఇతర భాషా దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా కాలం నుంచి ఉంది.

PREV
17
తమిళ దర్శకుల దెబ్బకు బలైన టాలీవుడ్ హీరోలు.. పవన్, మహేష్ నుంచి రామ్, చైతు వరకు సేమ్ రిజల్ట్

పరభాషా హీరోలు వేరే భాషల్లోకి వెళ్లి నటించడం ఇప్పుడిప్పుడే ఎక్కువవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ కారణంగా హీరోలు అన్ని భాషల్లో నటిస్తున్నారు. అయితే ఇతర భాషా దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా కాలం నుంచి ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో చేస్తున్న చేస్తున్న చిత్రాలు పూర్తిగా బెడిసికొడుతున్నాయి. తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో తమిళ దర్శకులు విఫలం అవుతున్నారు. తమిళ దర్శకుల వల్ల ఇటీవల పరాజయాలు ఎదుర్కొన్న టాలీవుడ్ హీరోలు ఆ చిత్రాలని ఒకసారి పరిశీలిద్దాం. 

27

రామ్- వారియర్ 

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి, ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన చిత్రం ది వారియర్. ఈ చిత్రం చూడడానికి యావరేజ్ గా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన తన ఇమేజ్ ని లింగుస్వామి మరింత పెంచుతారు అని భావించిన రామ్ కి నిరాశే ఎదురైంది. 

37

విజయ్ దేవరకొండ - నోటా 

మరో తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం నోటా. విజయ్ దేవరకొండ వరుస విజయాలతో జోరుమీద ఉన్న టైంలో ఈ ద్విభాషా చిత్రంలో నటించాడు. నోటా చిత్రం తెలుగు ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. 

47

పవన్ - పంజా 

పవన్ కళ్యాణ్ కి యస్ జె సూర్య లాంటి కొందరు తమిళ దర్శకులు మంచి హిట్స్ ఇచ్చారు. తమిళంలో బిల్లా లాంటి సూపర్ హిట్ తెరకెక్కించిన విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ కి పంజా రూపంలో ఫ్లాప్ ఇచ్చారు. 

57

నాగ చైతన్య- కస్టడీ 

అక్కినేని అభిమానులకు వరుసగా రెండవ షాక్ ఇచ్చిన చిత్రం కస్టడీ. అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత వచ్చిన కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం జోరు చూపించడం లేదు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు.. నాగ చైతన్య హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకట్ ప్రభు నాగ చైతన్యతో చేసిన ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. 

67

నాని - జెండాపై కపిరాజు 

నేచురల్ స్టార్ నానికి కూడా తమిళ దర్శకుల నుంచి చేదు అనుభవం ఉంది. ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ విలన్ గా దూసుకుపోతున్న సముద్రఖని దర్వకత్వంలో నాని గతంలో జెండాపై కపిరాజు అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్రం నాని కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సముద్ర ఖని.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నారు. 

77

మహేష్ బాబు - స్పైడర్ 

మహేష్ బాబు కెరీర్ లోనే స్పైడర్ చిత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి. మురుగదాస్ లాంటి సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ ఇలాంటి డిజాస్టర్ ఇవ్వడంతో మహేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మెయిన్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కథని తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో మురుగదాస్ విఫలం అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories