ఓ దశాబ్దం పాటు, కుర్రకారు కలల రాణిగా ఉన్నారు. ఇప్పటికీ ఆమె హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో శ్రీయా నటించడం జరిగింది.
తాజాగా ఆమె ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో భాగం కావడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా, ఆయనకు భార్యగా శ్రీయా చిన్న పాత్ర చేస్తున్నారు. నిడివి తక్కువైనా ఆమె కీలకమైన పాత్ర అని తెలుస్తుంది.
కాగా 2018లో శ్రీయా రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషీవ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లితో ఏకమయ్యారు. పెళ్ళైనా కూడా శ్రీయా కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఆండ్రీ శ్రీయాకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది.
అయితే శ్రీయా శరన్.. తాను తల్లిని అయ్యాయని, ఓ ఆడపిల్లకు జన్మను ఇచ్చానని చెప్పి అందరి మైండ్ బ్లాక్ చేశారు. శ్రీయాకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు.. కానీ ఆమె తల్లి అయిన విషయం ఇంత వరకు ఎవరికీ తెలియదు.
2020 లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన శ్రీయా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారట. ఆ సమయంలో శ్రీయా గర్భం దాల్చారట. అనంతరం ఆమె ఆడ పిల్లను కనడం జరిగిందట. ఇక ఆడ పిల్ల పేరు రాధా అట.