నామినేషన్ల ప్రక్రియకి ముందు ఇంటి సభ్యులు ఒకరినొకరు తమ మధ్య ఉన్న మిస్ అండర్ స్టాండింగ్‌ని సరి చేసుకునే పనిలో పడ్డారు. ప్రియాతో తన సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేశాడు విశ్వ. కానీ ఆమె వినలేదు. ఎప్పటిలాగానే షణ్ముఖ్, సిరి, జెస్సీ తమ గుసుగుసలతో రెచ్చిపోయారు. రాత్రి సమయంలో శ్రీరామ్ కలవరించడం అందరిని ఉలిక్కిపాటుకు గురి చేసింది.
నామినేషన్ల ప్రక్రియ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులు ఎప్పటిలాగే ఇద్దరిని నామినేట్ చేశారు. ఈ వారం ప్రియా కెప్టెన్‌గా ఉండటంతో ఆమెని నామినేట్ చేయడానికి లేదు. మొదట సన్నీ.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. కాయిన్స్ దొంగతనం విషయంలో జెస్సీని నామినేట్ చేశాడు సన్నీ. మరోవైపు విశ్వ.. అనీ మాస్టర్, ప్రియాంకలని నామినేట్ చేశాడు. అలాగే స్వేత.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది. లోబో.. ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు. నాణేలను దొంగతనం చేసే విషయంలో నమ్మక ద్రోహం చేశారని తెలిపింది.
సిరి.. శ్రీరామ్, స్వేతలను నామినేట్ చేసింది. కిచెన్‌లో జరిగిన ఇష్యూలో బయాస్‌గా ఉన్నావని శ్రీరామ్‌ని నామినేట్ చేసింది. స్వేతని రాజ్యం టాస్క్ లో విషయంలో నామినేట్ చేసింది. రవి.. మానస్, సిరిలను నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో తన ట్యాంక్ ట్యాప్ తీశాడని, నాణేల విషయంలో సిరిని నామినేట్ చేశాడు రవి. జెస్సీ.. శ్రీరామ్, సన్నీలను నామినేట్ చేశాడు. టాస్క్ లో సొల్లు కబుర్లు చెబుతూ, పార్టిసిపేట్ చేయడం లేడని తనని అన్నాడని శ్రీరామ్‌ని, ట్రస్ట్ విషయంలో సన్నీని నామినేట్ చేశారు.
ప్రియాంక.. లోబోని, విశ్వని నామినేట్ చేసింది. నాణేలు దొంగిలించడమని నామినేట్ చేయడం, నమ్మకం పోయిందనడం కరెక్ట్ కాదని, ఫైర్ అవుతూ లోబోని నామినేట్ చేసింది. అలాగే కెప్టెన్సీ టాస్క్ లో బకెట్ లాక్కునే విషయంలో విశ్వని నామినేట్ చేసింది ప్రియాంక. మానస్.. రవి, లోబోలను నామినేట్ చేశాడు. తనని సాక్రిఫైజ్ చేస్తున్నావని అనడం నచ్చలేదని రవిని, ట్రస్ట్ బ్రేక్ చేశావని అన్నందుకు లోబోని నామినేట్ చేశాడు మానస్.
అనీ మాస్టర్.. షణ్ముఖ్, విశ్వలను నామినేట్ చేసింది. స్ట్రాంగ్ కంటెండర్ అని, శ్రీరామ్‌తో జరిగిన కన్వర్జేషన్‌లో వ్యవహరించిన తీరు విషయంలో షణ్ముఖ్ ని, తనని నామినేట్ చేశాడని విశ్వని నామినేట్ చేసింది అనీ మాస్టర్. ఈ సందర్భంగా విశ్వ, ఆనీ మాస్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనని ఇంకా ఎప్పుడు అక్క అని పిలవొద్దని తెలిపింది. శ్రీరామ్.. సిరి, షణ్ముఖ్‌లను నామినేట్ చేశారు. తాను బయాస్‌గా లేనని, ఆ మాట అనడం నచ్చలేదని సిరిని, సీక్రెట్ నామినేషన్‌లో జరిగిన దాని తర్వాత రియాక్ట్ అయిన విధానం విషయంలో షణ్ముఖ్‌ని నామినేట్ అవుతున్నట్టు తెలిపాడు. అయితే ఈ సందర్భంగా సిరిని ఉద్దేశించి శ్రీరామ్ మాట్లాడిన వ్యాఖ్యలను షణ్ముఖ్ ఖండించాడు. `నువ్వు దేవుడివి. మీ మాటలు మేం వినాలా?` అంటూ మండి పడ్డాడు షణ్ముఖ్.
కాజల్..శ్రీరామ్, స్వేతలను నామినేట్ చేసింది. తనకు ఎమోషన్స్ లేవని, ఎవరితోనూ అటాచ్‌మెంట్ వద్దని, గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చానని తెలుపుతూ శ్రీరామ్‌ని నామినేట్ చేసింది. గత వారం నామినేట్ చేసినందుకు స్వేతని నామినేట్ చేసింది కాజల్. షణ్ముఖ్.. శ్రీరామ్, లోబోలను నామినేట్ చేశాడు. తాను కించపర్చలేదని శ్రీరామ్‌ని, గత వారం తనని నామినేట్ చేసిన కారణం సరైనది కాదని లోబోని నామినేట్ చేశాడు షణ్ముఖ్. ప్రియా.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. విశ్వ కొన్ని సార్లు నోరు జారుతాడని, మేకప్ వేసుకోడమేకాదు, గేమ్ కూడా ఆడాలని తనని అన్నాడని విశ్వని, సన్నీతో ఇంకా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది. దీంతో సన్నీ కూడా ప్రతి వారం ప్రియానే నామినేట్ చేస్తానని తెలిపారు.
మొత్తంగా ఆరో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, స్వేత, సన్నీ, జెస్సీలు నామినేట్ అయ్యారు. అత్యధికంగా ఈ సారి పది మంది నామినేషన్లలో ఉండటం విశేషం. ఇక గత ఐదు వారాల్లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.