Top 10 Day 1 Box Office: తొలి రోజే ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలు.. తెలుగు హీరోలు ఎందరంటే?

Published : Oct 28, 2026, 01:48 PM IST

Top 10 Day 1 Box Office: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్. ఈ లిస్ట్‌లో పుష్ప 2 ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఆ తర్వాత RRR, బాహుబలి 2 ఉన్నాయి.

PREV
111
అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 సినిమాలు

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజైన ఫస్ట్ డేనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' మొదటి స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ఉండటం విశేషం. యష్‌, ఎన్టీఆర్‌ చిత్రాలు రెండున్నాయి. మరి మిగతా సినిమాలు ఏంటో చూద్దాం. ఇందులో తెలుగు హీరోలదే హవా ఉండటం విశేషం.

211
పుష్ప 2

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 2024లో రిలీజైన ఈ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా 32,140 షోల ద్వారా ₹164.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ టోటల్ గ్రాస్ ₹209.01 కోట్లు. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹66 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹275.01 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

311
ఆర్‌ఆర్‌ఆర్‌

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా రెండో స్థానంలో ఉంది. 2022లో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ₹133 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹223 కోట్లు కాగా, ఇందులో ఓవర్సీస్ కలెక్షన్స్ ₹67 కోట్లు, ఇండియా గ్రాస్ ₹156 కోట్లు ఉన్నాయి.

411
బాహుబలి 2

ప్రభాస్ నటించిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' మూడో స్థానంలో నిలిచింది. 2017లో రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో ₹121 కోట్ల నెట్, ₹153 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ₹65 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹217 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

511
ధురంధర్‌ 2

నాల్గో స్థానంలో ఉన్న రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2: ది రివెంజ్' ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక బాలీవుడ్ సినిమా. 2026లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజే ₹102.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో దీని గ్రాస్ ₹174.60 కోట్లు. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹52 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹226.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

611
కేజీఎఫ్‌ 2

టాప్ 10 లిస్ట్‌లో యశ్ నటించిన 'KGF చాప్టర్ 2' ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ఇండియాలో ₹116 కోట్ల నెట్, ₹134.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ ₹159 కోట్ల గ్రాస్ రాబట్టింది.

711
టాక్సిక్‌

ఆరో స్థానంలో యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా ఉంది. తొలి రోజే దేశవ్యాప్తంగా 24,579 షోల ద్వారా ఈ సినిమా ₹101.10 కోట్ల నెట్, ₹120.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹20 కోట్ల గ్రాస్ సాధించి, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹140.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

811
కల్కి 2898 ఏడీ

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా ఏడో స్థానంలో ఉంది. 2024లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో ₹95.30 కోట్ల నెట్, ₹114.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ₹63.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹177.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది.

911
సలార్‌

ఎనిమిదో స్థానంలో కూడా ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్' సినిమానే నిలిచింది. 2023లో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ₹90.70 కోట్ల నెట్, ₹107.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్‌లో ₹51 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹158.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

1011
ఆదిపురుష్‌

తొమ్మిదో స్థానంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్లాప్ అయినా, రిలీజైన ఫస్ట్ డే మాత్రం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 2023లో వచ్చిన ఈ చిత్రం ఇండియాలో ₹86.75 కోట్ల నెట్, ₹103.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ₹25 కోట్ల గ్రాస్ సాధించి, వరల్డ్‌వైడ్‌గా మొత్తం ₹128.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

1111
దేవర

టాప్ 10 లిస్ట్‌లో పదో స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' దక్కించుకుంది. 2024లో రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో ₹82.50 కోట్ల నెట్, ₹98.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా ₹142.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ వి రెండు సినిమాలుండటం విశేషం. ఇటీవల వచ్చిన రజనీకాంత్‌ `జైలర్‌ 2` మూవీ రూ.125కోట్ల గ్రాస్‌తో 14వ స్థానంలో ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories