నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, రవి దూబే, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, లారా దత్తా, ఇంద్ర కృష్ణన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, షీబా చద్దా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.