Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?

Published : Mar 20, 2026, 11:21 AM IST

Dhurandhar 2 Day 1 Collection: రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన `ధురంధర్‌ 2` బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా 2026లోనే కాదు, ఇప్పటివరకు బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.  మరి పుష్ప 2ని దాటేసిందా?

PREV
16
ధురంధర్‌ 2 మూవీ బాక్సాఫీసు

రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా, సారా అర్జున్‌ హీరోయిన్‌గా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రూపొందిన `ధురంధర్‌ 2` మూవీ ఉగాది సందర్భంగా విడుదలైంది. ఇదిప్పుడు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com రిపోర్ట్ ప్రకారం, `ధురంధర్‌: ది రివెంజ్' హిందీలో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.99.10 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇది 2026లోనే కాదు, బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సన్నీ డియోల్ 'బార్డర్ 2'ను, షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

26
'బార్డర్ 2' మొదటి రోజు కలెక్షన్లు

సన్నీ డియోల్ నటించిన 'బార్డర్ 2' సినిమా 2026 జనవరి 23న విడుదలైంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.30 కోట్లు సంపాదించింది. అయితే 'ధురంధర్‌ 2' మధ్యాహ్నం 3 గంటలకే ఈ మార్కును దాటేసింది. ఫైనల్ లెక్కలు వచ్చేసరికి 'బార్డర్ 2' కంటే రెట్టింపు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.  

36
'జవాన్' మొదటి రోజు ఎంత సంపాదించింది?

షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'జవాన్' 2023లో విడుదలైంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.75 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'ధురంధర్‌ 2' దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది.

46
`ధురంధర్‌ 2' మొదటి రోజు కలెక్షన్లు

స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్‌ `' ఇండియాలో ఇప్పటివరకు సుమారు రూ.142.1 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం హిందీ వెర్షన్ కలెక్షన్ మాత్రమే. అన్ని భాషలు కలిపి చూస్తే, ఈ సినిమా రూ.145.55 కోట్లు సంపాదించింది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఆ రోజు 12,292 షోల ద్వారానే సినిమాకు సుమారు రూ.43 కోట్లు వచ్చాయి.

56
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిన 'ధురంధర్‌ : ది రివెంజ్'

ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, 'ధురంధర్‌: ది రివెంజ్' మొదటి రోజు ఇండియాలో గ్రాస్‌గా రూ.172.63 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో మొదటి రోజే సుమారు రూ.64 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ లెక్కన చూస్తే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.236.63 కోట్లు సంపాదించినట్లు అయ్యింది.

66
పుష్ప 2 కలెక్షన్లని దాటలేకపోయిన ధురంధర్‌ 2

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ లో అన్ని డే 1 రికార్డులు బ్రేక్‌ చేసిన `ధురంధర్‌ 2` సినిమా `పుష్ప 2` రికార్డులను మాత్రం బ్రేక్‌ చేయలేకపోయింది. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌, బజ్‌ని బట్టి చూస్తే అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` రికార్డులు కూడా బ్రేక్‌ అవుతాయని భావించారు. కానీ అంత సాధించలేకపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప 2` మొదటి రోజు రూ.294కోట్లు రాబట్టినట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories