బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తన ప్రియుడు, వ్యాపారవేత్త టోనీ బెయిగ్‌ను లాస్ ఏంజిల్స్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో పెళ్లి చేసుకుంది. నటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. 'టోబీ అండ్ నర్గీస్' అనే వెల్కమ్ బోర్డు ఫోటో వైరల్ అయింది.
టోనీ బెయిగ్ ఎవరు?
టోనీ బెయిగ్ కాశ్మీరీ మూలానికి చెందిన యూఎస్ వ్యాపారవేత్త. ఇతను డియోజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. 1984లో జన్మించిన టోనీ ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్‌లో నివసించాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. 2005లో అలానిక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. నర్గీస్ ఫక్రీతో రిలేషన్ కారణంగా టోనీ వెలుగులోకి వచ్చాడు.