Venkatesh: వెంకటేష్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత తన ప్రయారిటీలు మార్చుకున్నారు. అంతకు ముందు ఉన్న ప్లాఫ్ ల నుంచి ఆ సినిమా బయిటపడేసింది. ఈ క్రమంలో ఇప్పుడు దృశ్యం 3 రీమేక్ లో వెంకటేష్ నటిస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
Is Venkatesh will bring Drishyam 3 to Telugu screens? in telugu
Venkatesh: వెంకటేష్ కు ప్రత్యేకమైన ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్...మొన్న సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తో సహా. అయితే మధ్య మధ్యలో యాక్షన్ సినిమాలతో రచ్చ చేయాలని చూసినా వెంకటేష్ కి అవేమీ సక్సెస్ ఇవ్వలేదు.
ఆయన్ని ఒక ఫ్రేమ్ లోనే చూడటానికి ఆసక్తి చూపించారు జనం. ఈ క్రమంలో ఆయనతో చేసిన ‘దృశ్యం’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ మళయాళంలో చేసిన ‘దృశ్యం’ తెలుగులో వెంకటేష్ ఇంకా బాగా చేసాడన్న పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆ తర్వాత కోవిడ్ టైమ్ లో ‘దృశ్యం’2 ని రీమేక్ చేసారు. కానీ థియేటర్ రిలీజ్ కాలేదు. ఓటిటిలోనూ పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘దృశ్యం’ -3కు రంగం సిద్దమైంది. ఇప్పుడు వెంకటేష్ ఈ సినిమా రీమేక్ లో చేస్తాడా చెయ్యడా అనేది హాట్ టాపిక్ గా మారింది.
23
Is Venkatesh will bring Drishyam 3 to Telugu screens? in telugu
అయితే అందుతున్న సమాచారం మేరకు వెంకటేష్ ‘దృశ్యం’ సీక్వెల్స్ లో కనిపించకూడదనుకున్నారట. అందుకే ‘దృశ్యం’2 కు పెద్దగా రెస్పాన్స్ రాకపోవటే కారణం అంటున్నారు. దాంతో ‘దృశ్యం’3 చేస్తాడనే నమ్మకం లేదంటున్నారు . సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత ఆయన ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా దృశ్యం ఫ్రాంచైజీ నుంచి పార్ట్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు.
'దృశ్యం 3' ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్‌లాల్ పేర్కొన్న పోస్ట్‌లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది.
33
Is Venkatesh will bring Drishyam 3 to Telugu screens? in telugu
2013లో విడుదలైన 'దృశ్యం పార్ట్ 1' 150 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శితమైంది. దశాబ్దం పాటు అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో టాప్ 10లో నిలిచింది. అంతేకాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 125 రోజుల పాటు ప్రదర్శితమై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత 2021లో వచ్చిన పార్ట్ 2 కూడా అంతే విజయాన్ని అందుకుంది. ఇందులో మీనా అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, నీరజ్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు. మొదటగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల్లో రీమేక్ చేశారు. అయితే రీమేక్ చేసిన అన్ని భాషల్లోని సూపర్ హిట్ అయ్యింది.