రూటు మార్చిన యంగ్ హీరోలు.. లవ్, రొమాన్స్ బొర్ కొట్టి.. యాక్షన్ లోకి కుర్రాళ్లు

Published : Mar 05, 2022, 12:37 PM ISTUpdated : Mar 05, 2022, 12:40 PM IST

సినిమాల్లోకి వచ్చాక ఒక జానర్ కి ఫిక్స్ అయిపోయారనే ఇమేజ్ తెచ్చుకోకుండా ఉండడానికి అన్నిరకాల క్యారెక్టర్లు చేస్తుంటారు. లవ్ , రొమాన్స్ , ఎమోషన్ , యాక్షన్ లాంటి అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తున్నారు.

PREV
17
రూటు మార్చిన యంగ్ హీరోలు.. లవ్, రొమాన్స్ బొర్ కొట్టి.. యాక్షన్ లోకి కుర్రాళ్లు

కొంత మంది హీరోలు యాక్షన్ సీన్స్ చేస్తే చూడలేపోతున్నారు జనాలు. ఆ హీరోలేమో అన్ని జానర్లు టచ్ చేసి.. ఆడియన్స్ అభిమానాన్ని చూడాలని ఆరాట పడుతున్నారు. మరి యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యలేకపోతున్న హీరోలెవరు..? 

27

రొమాన్స్ , లవ్ బోర్ కొట్టేసిందని యాక్షన్ లోకి దిగిన హీరోలు సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఆలిస్ట్ లో నాని బెస్ట్ ఎక్జాంపుల్.. అప్పటి వరకూ ఫ్యామీలీ, లవ్ స్టోరీస్ సినిమాలు చేసి ఆడియన్స్ కి దగ్గరైన నాని ..వి, టక్ జగదీష్ సినిమాల్లో  యాక్షన్ చేసి చూపించారు. మిగతా ఎమోషన్స్ ఉన్నా కూడా యాక్షన్ కంటెంటే ఎక్కువ  చేశారు నాని. కానీ ఈ రెండు సినిమాల రిజల్ట్ నానీకి మైలేజ్ ఇవ్వలేకపోయాయి. దాంతోమళ్లీ రూటు మార్చాడు నేచురల్ స్టార్. 
 

37

ఆమధ్య వరసగా లవ్ రొమాంటిక్ సినిమాలు చేసిన నితిన్ ..రూట్ మార్చి యాక్షన్ చేసి చేతులు కాల్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ చెస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన  యాక్షన్ మూవీ  చెక్, అంతకుముందు వచ్చిన లై లాంటి యాక్షన్ మూవీస్ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్స్ రంగ్ దే , మ్యాస్ట్రో మంచి రిజల్టే ఇచ్చాయి. సో ..ఆడియన్స్ కి నితిన్ యాక్షన్ చేస్తే నచ్చట్లేదని తెలిసిపోయింది. 

47

శర్వానంద్ కూడా కెరీర్ లో రకరకాల జానర్స్ ట్రై చేశారు. వీటన్నింటిలోయాక్షన్  బ్యాక్ డ్రాప్ లో వచ్చిన  సినిమాలు మాత్రం పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయాయి. శర్వా రణరంగం, మహాసముద్రం లాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. కానీ పడిపడి లేచెమనసు, మహానుభావుడు, శతమానంభవతి లాంటి ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.
 

57

రీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన అక్కినేని హీరో అఖిల్ కి కూడా పెద్దగా యాక్షన్ కలిసిరాలేదు . అఖిల్ మూవీ తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ యాక్షన్ తో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూట్ మార్చి హలో, మిస్టర్ మజ్ను లాంటి డిఫరెంట్ మూవీస్ చేసినా వర్కవుట్ కాలేదు. కానీ రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది.

67

మరో యంగ్ హీరో నాగశౌర్య యాక్షన్  సినిమాలు చేస్తే అంతగా ఆదరించడం లేదు ఆడియన్స్ . అశ్వద్దామ, లక్ష్య లాంటి సినిమాలు అనుకున్నంతహిట్ కొట్టలేకపోయాయి. అయితే ఓ బేబీ, వరుడు కావలెను లాంటి క్యూట్ లవ్ స్టోరీలు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. 

77

ఇలా ఈ క్యూట్ హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం జనాలకు నచ్చడం లేదు.. సాప్ట్ కుర్రాలు సాప్ట్ లవ్ స్టోరీస్ చేస్తేనే చూస్తామంటున్నారు. అందుకే  యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories