టాలీవుడ్ క్రేజీ హీరోతో హీరోయిన్ వివాహం ? త్వరలో ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 18, 2022, 05:04 PM IST

సునీల్ సరసన కృష్ణాష్టమి చిత్రంలో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రాని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఓ క్రేజీ హీరోని ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.    

PREV
16
టాలీవుడ్ క్రేజీ హీరోతో హీరోయిన్ వివాహం ? త్వరలో ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు..

హీరోయిన్ నిక్కీ గల్రాని సౌత్ లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమి, ఆది పినిశెట్టి సరసన మలుపు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు. నిక్కీ గల్రాని ఇండస్ట్రీలోకి సంజన గల్రాని సోదరిగా ఎంట్రీ ఇచ్చింది. 

26

ప్రస్తుతం నిక్కీ గల్రాని గురించి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. నిక్కీ గల్రాని అతి త్వరలో ఓ ఫేమస్ హీరోని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడు మరెవరో కాదు.. హీరోగా, విలన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్న ఆది పినిశెట్టి. 

 

36

మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అంటున్నారు. ఆది పినిశెట్టి సన్నిహితులు ఈ విషయాన్ని మీడియాకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆది, నిక్కీ గల్రాని ఇద్దరూ తమ రిలేషన్ జీవితాంతం కొనసాగించబోతున్నారు అని.. దీని కోసం వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. 

46

వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారట. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిక్కీ గల్రాని.. ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతోందట.  

56

ఆ మధ్య వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో జంటగా కూడా కనిపించారు. నిక్కీ గల్రాని ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. 

66

ఇక ఆది పినిశెట్టి హీరోగా రాణిస్తూనే.. సరైనోడు, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు. ఇక రంగస్థలం చిత్రంలో రాంచరణ్ సోదరుడిగా అత్యంత కీలక పాత్రలో నటించాడు. 

click me!

Recommended Stories