Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు

Published : Jul 27, 2026, 02:35 PM IST

ఆన్ స్క్రీన్ పై తమ నటనతో, విలనిజంతో ప్రేక్షకులని భయపెట్టే భారతీయ సినీ నటులు నిజ జీవితంలో మాత్రం చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, సోనూసూద్, అజయ్, మురళి శర్మ లాంటి క్రేజీ విలన్లు ఉన్నారు

PREV
18
Tollywood Villains

ఆన్ స్క్రీన్ పై తమ నటనతో, విలనిజంతో ప్రేక్షకులని భయపెట్టే భారతీయ సినీ నటులు నిజ జీవితంలో మాత్రం చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, సోనూసూద్, అజయ్, మురళి శర్మ లాంటి క్రేజీ విలన్లు ఉన్నారు. వారి అందమైన భార్యలు, వారి గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

28
ప్రకాష్ రాజ్

దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిన కూడా తన వైవిధ్యమైన నటనతో భయంకరమైన విలన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. ఆయన ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మను 2010లో వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆయన నటి లలిత కుమారిని వివాహం చేసుకోగా, ఆ తర్వాత విడిపోయి పోనీ వర్మతో నూతన జీవితాన్ని ప్రారంభించారు.

38
సోనూసూద్

వెండితెరపై క్రూరమైన విలన్‌గా నటిస్తూనే, రియల్ లైఫ్‌లో ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సోనూసూద్. ఆయన భార్య పేరు సోనాలీ సూద్. సినీ రంగానికి దూరంగా ఉండే సోనాలి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మహిళ కాగా, ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు.

48
మురళి శర్మ

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు మురళి శర్మ. ఆయన భార్య అశ్విని కాల్సికర్ కూడా భారతీయ సినిమాల్లో, సీరియల్స్‌లో (ముఖ్యంగా 'సింగం', 'గోల్‌మాల్' సిరీస్ చిత్రాల్లో) పవర్ ఫుల్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన ప్రసిద్ధ నటి.

58
అజయ్

తెలుగు సినిమాల్లో తన పవర్ ఫుల్ నటనతో విలన్‌గా, సహాయ నటుడిగా ఎంతో మెప్పించారు అజయ్. ఆయన భార్య పేరు శ్వేతా . డెహ్రాడూన్‌కు చెందిన శ్వేత 2006లో 'మిసెస్ ఇండియా' రన్నరప్‌గా నిలిచారు, ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

68
తరుణ్ అరోరా

'ఖైదీ నంబర్ 150', 'కాటమరాయుడు', 'కాంచన 3' వంటి చిత్రాలలో స్టైలిష్ విలన్‌గా, బాలీవుడ్‌లో 'జబ్ వి మెట్' చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు తరుణ్ అరోరా. ఆయన భార్య అంజలా జవేరి ఒకప్పటి ప్రసిద్ధ హీరోయిన్. తెలుగులో 'ప్రేమించుకుందాం రా', 'సమరసింహా రెడ్డి', 'చూడాలని ఉంది' వంటి సూపర్ హిట్ చిత్రాలలో వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణలతో నటించిన ఆమె, తరుణ్ అరోరాని వివాహం చేసుకున్నారు.

78
అశుతోష్ రాణా

'పటాస్', 'వెంకీ' వంటి అనేక సినిమాల్లో తన భయంకరమైన నటనతో వణుకు పుట్టించిన నటుడు అశుతోష్ రాణా. ఆయన భార్య రేణుకా షహానే కూడా ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకురాలు. ఆమె 'హమ్ ఆప్‌కే హైన్ కౌన్' సినిమాలో సల్మాన్ ఖాన్ వదినగా నటించి ఎంతో గుర్తింపు పొందారు.

88
షాయాజీ షిండే

తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో విలన్‌గా, కామెడీ రోల్స్‌లో అలరించిన నటుడు షాయాజీ షిండే. ఆయన భార్య పేరు ఆశా షిండే. ఆమె గృహిణిగా ఉంటూ, షాయాజీ షిండే కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories