కృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవిల రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యం.. అల్లరి నరేష్ ఒక్కడే!

First Published May 27, 2019, 7:13 PM IST

ప్రస్తుతం ఉన్న హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప. కొన్ని సంధర్భాల్లో కథ దొరకలేదని ఏడాది మొత్తం ఖాళీగా ఉన్న హీరోలు కూడా ఉన్నారు. కానీ గతంలో అలా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు లాంటి హీరోలు నటించిన చిత్రాలు ఒకే ఏడాది పదుల సంఖ్యలో విడుదలయ్యేవి. ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలని విడుదల చేసిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే. ప్రస్తుతం ఉన్న హీరోలు కాస్తో కూస్తో వేగంగా చిత్రాలు చేసే హీరో అంటే అల్లరి నరేష్ పేరే చెప్పుకోవాలి. 

కృష్ణ: సూపర్ స్టార్ కృష్ణ వేగానికి మరో పేరు. 1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు విడుదలయ్యాయి. పలు సంవత్సరాలలో కృష్ణ పదికి పైగా సినిమాలని విడుదల చేశారు. కృష్ణ 18 చిత్రాల రికార్డుని ఇంతవరకు మారే హీరో అందుకోలేపోయారు. ఇకపై అసాధ్యం కూడా.
undefined
ఎన్టీఆర్: స్వర్గీయ నందమూరి తారక రామారావు 1964లో ఏకంగా 17 చిత్రాలని విడుదల చేశారు. ఆ ఏడాది జానపద, పౌరాణిక చిత్రాలతో ఆయన దూసుకుపోయారు.
undefined
ఏఎన్నార్ : అక్కినేని నాగేశ్వర రావు కెరీర్ మొత్తం స్టడీగా సాగింది. 1960, 71 సంవత్సరాలలో ఏఎన్నార్ నటించిన తొమ్మిదేసి చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
కృష్ణంరాజు : రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తక్కువేం కాదు. 1974లో కృష్ణంరాజు నటించిన 17 చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
రాజేంద్ర ప్రసాద్: కామెడీ హీరోలకు ఉండే అడ్వాంటేజ్ మరే స్టార్ హీరోకు ఉండదు. సింపుల్ కథలతో చక చక సినిమాలు చేసేయొచ్చు. కామెడీ హీరోగా ఉర్రూతలూగించిన రాజేంద్ర ప్రసాద్ 1988లో 17 చిత్రాలని విడుదల చేశారు.
undefined
చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న రోజుల్లో వరుస చిత్రాలతో దూకుడు ప్రదర్శించారు. 1980లో ఏకంగా చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
శోభన్ బాబు : సోగ్గాడు శోభన్ బాబు కూడా పలు సంవత్సరాలలో 8నుంచి 10 చిత్రాల్లో నటించారు. 1980 అత్యధికంగా శోభన్ బాబు నటించిన 12 చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
అల్లరి నరేష్ : ఈ తరం హీరోల్లో వేగంగా సినిమాలు చేసే హీరో అల్లరి నరేషే. అల్లరి నరేష్ 2008లో అత్యధికంగా 8 చిత్రాల్లో నటించి విడుదల చేశాడు.
undefined
బాలకృష్ణ : బాలయ్య 80, 90 దశకాలలో ఏడాదికి 4 నుంచి 6 చిత్రాల్లో నటించిన సంధర్భాలు ఉన్నాయి. 1987లో బాలయ్య నటించిన 7 చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
జగపతి బాబు : 90 దశకంలో జగపతి బాబు కుటుంబకథా చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. 1996లో జగపతి బాబు నటించిన 6 చిత్రాలు విడుదలయ్యాయి.
undefined
శ్రీకాంత్ : ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కెరీర్ లోని బెస్ట్ చిత్రాలన్నీ 90వ దశకంలోనే విడుదలయ్యాయి. 1998లో శ్రీకాంత్ నటించిన 8 చిత్రాలు విడుదల కావడం విశేషం.
undefined
వెంకటేష్ : విక్టరీ వెంకటేష్ కెరీర్ ఆరంభంలోనే అత్యధిక చిత్రాల్లో నటించాడు. 1996లో వెంకీ నటించిన 6 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం వెంకీ నుంచి ఏడాదికి ఒక చిత్రం మాత్రమే వస్తోంది.
undefined
నాగార్జున : కింగ్ నాగార్జున నటించిన ఏడాదికి 5 మించి ఎప్పుడూ సినిమాలు చేయలేదు. 1987, 89, 92, 2001 సంవత్సరాలలో నాగార్జున ఐదేసి చిత్రాలని విడుదల చేశారు.
undefined
click me!