బాక్స్ ఆఫీస్ ఫైట్.. ఈ వారం ఐదు సినిమాల హంగామా!

First Published May 27, 2019, 1:20 PM IST

ఈ సమ్మర్ హాలిడేస్ ని టాలీవుడ్ పెద్దగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. సమ్మర్ హాట్ గా ఉందనుకున్నారో లేక పొలిటికల్ హీట్ డామినేట్ చేస్తుందనుకున్నారో ఏమో గాని సినిమాల హడావుడి పెద్దగా కనిపించలేదు.

మెయిన్ గా ఒకేసారి సినిమాలు పోటీ పడటం చూసి చాలా కాలమవుతోంది. ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత 5 సినిమాలు మే 31న బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి సిద్ధమయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.
undefined
సూర్య NGK: అప్పట్లో 7G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేసిన సెల్వ రాఘవన్ ఫస్ట్ టైమ్ సూర్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై తమిళ్ జనాలతో పాటు తెలుగు జనాల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
undefined
ఫలక్‌నుమా దాస్: విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. మాస్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాపై కూడా యువతలో అంచనాలు భారీగానే ఉన్నాయ్.
undefined
అభినేత్రి 2: హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రభుదేవా రెండవ వెర్షన్ తో సిద్దమయ్యాడు. ఫస్ట్ పార్ట్ పర్వాలేధనిపించినా ఈ సినిమాకు పెద్దగా బజ్ ఏమి లేదు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
undefined
సువర్ణసుందరి: హిస్టారికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ జయప్రద ముఖ్య పాత్రలో నటించగా సాక్షి చౌదరి - పూర్ణ సహా నటులుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫైట్ లో ఈ సినిమా నిలదొక్కుకోవడం కష్టమే.
undefined
గాడ్జిల్లా: 2014 గాడ్జిల్లా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా కూడా తెలుగులో అనువాదమైంది. హై విజువల్ గ్రాఫిక్స్ ని ఇష్టపడే తెలుగు ఆడియెన్స్ ని ఈ సినిమా ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఏ మాత్రం క్లిక్కయినా మిగతా నాలుగు సినిమాల కలెక్షన్స్ కి గండి పడ్డట్లే..
undefined
click me!