క్రీడారంగంలోకి విజయ్ దేవరకొండ.. స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన సెన్సేషనల్ స్టార్!

First Published | Jan 23, 2023, 12:23 PM IST

టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వెండితెరపైన అలరిస్తూనే..  మరోవైపు ఆయా రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఓ వాలీబాల్ జట్టుకు సహ యజమానిగా మారాడు. 

‘అర్జున్ రెడ్డి’ మొదలు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆయన మ్యానరిజం, తనదైన అటిట్యూడ్, వాక్ చాతుర్యం తో యూత్ లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. 
 

మరోవైపు ఆయా రంగాలలోకీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఫ్యాషన్ ఈ-కామర్స్ మేజర్ మైంత్రాతో కలిసి ‘రౌడీ వేర్’ని ప్రారంభించారు. ఇక తాజాగా క్రీడారంగంలోనూ అడుగుపెట్టి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. 


తాజా సమాచారం ప్రకారం.. విజయ్ హైదరాబాద్‌లోని ప్రొఫెషనల్ వాలీబాల్ మెన్స్ టీమ్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad black Hawks)ను కొనుగోలు చేశారు. బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహ యజమానిగా మారాడు. విజయ్ తన స్కూల్ డేస్ నుంచే వాలీబాల్‌ని ఇష్టపడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో క్రీడా రంగంలో అడుగుపెట్టినట్టు సమాచారం. 
 

ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజయ్ తన టీమ్ తో కలిసి జెర్సీని ఆవిష్కరించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై వాలీబాల్ ఆటను దేశం గర్వించేలా తనవంతుగా ప్రోత్సహిస్తానని తెలిపారు. భారత్ లోనే కాకుండా ఇతర ప్రాంతాలకూ టీమ్ ను తీసుకెళ్లేందుకు చేయాల్సింది చేస్తానన్నారు. 
 

తెలుగు ప్రజలకు తమ టీమ్ ప్రాతినిధ్యం వహిస్తుందని, అందుకు టీమ్ ను ఉత్సాహపరుస్తానని విజయ్ చెప్పాడు. ఈ టీమ్‌కు కో-ఓనర్ మారేందుకు విజయ్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడని తెలుస్తోంది. సహ యజమానిగానే కాకుండా.. బ్రాండ్ అంబాసిడర్ గానూ విజయ్ దేవరకొండనే ఉండటం విశేషం.

ప్రస్తుతం, విజయ్ ‘ఖుషి’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితోనూ VD12లో నటిస్తున్నారు. మూవీలో విజయ్ తన కెరీర్‌లో మొదటిసారి పోలీసుగా కనిపించనున్నారు. 

Latest Videos

click me!