బ్రహ్మానందం తరహాలో నవ్వించిన ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ ఉన్నారు. కానీ వీరెవరూ బ్రహ్మి తరహాలో సుదీర్ఘంగా సినిమాల్లో కొనసాగలేదు. బ్రహ్మానందం ని ఫ్యాన్స్ ముద్దుగా బ్రహ్మి అని, మీమ్ గాడ్ అని పిలుస్తుంటారు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, వెంకీ, దూకుడు లాంటి చిత్రాల్లో బ్రహ్మి హావభావాలు మీమ్స్ కి స్టఫ్ గా మారాయి.