1200 కు పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం.. ఎన్నికోట్లు సంపాదించారో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్..

First Published Feb 2, 2023, 1:51 PM IST

దాదాపు 12 వందలకు పైగా సినిమాలు.. నటుడిగా గిన్నిస్ రికార్డ్, మల్టీ టాలెంట్, విభిన్న పాత్రలు.. ఇంత సాధించిన హాస్య చక్రవర్తి బ్రహ్మానందం.. ఆస్తుల విలువ ఎంత ఉండవచ్చు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆయన ఆస్తులు విలువెంత..? 

టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ తీసుకుంటున్నాడు బ్రహ్మీ. అడపా దడపా.. గెస్ట్ రోల్స్ చేస్తూ.. అప్పుడప్పుడు వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమాల విషయంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన బ్రహ్మీ.. ఎంత సంపాదించి ఉంటాడు అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. 
 

 ఈ మధ్య టైమ్ బాగోలేక, ఆరోగ్యం పాడవడంతో సినిమాలు చేయడంలేదు కాని.. ఏ కమెడియన్ కూడా చేయలేనన్ని సినిమాలు చేశాడు బ్రహ్మనదం. గత కొద్ది రోజులుగా సినిమాలలో బ్యాడ్ టైమ్ ఎదుర్కుంటున్నారు బ్రహ్మానందం. ఆయన స్థాయికి తగినటువంటి పాత్రలు పడడం లేదు. 

దానికి తోడు యంగ్ జనరేషన్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి వారు ఎంట్రీతో.. కాస్త సీనియర్లకు అవకాశాలుతగ్గాయి. అయినా సరే అందరిమీద అంతో ఇంతో బ్రహ్మీకి అవకాశాలు వచ్చేవి కానీ.. రీసెంట్ గా ఆయనకు హార్డ్ సర్జరీ అవ్వడంతో... ఎక్కువగా ఇంటికే పరిమితం అయ్యాడు హాస్యబ్రహ్మ.

నటనమీద మక్కువతో.. ఆరోగ్యం ఎలా ఉన్నా.. అప్పుడప్పుడు తెరపై మెరుస్తున్నారు బ్రహ్మీ. రీసెంట్ గా బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కొద్ది సేపు అలా కనిపించి నవ్వించారు. అంతే కాదు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా తనకు తగ్గ పాత్రలో కనిపించబోతున్నారు. 

మరి ఇన్ని సినిమాలు చేసి.. ఇంత పేరు సంపాధించి బ్రహ్మానందం ఆస్తులు ఎంత సంపాదించి ఉంటారు అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తన్నారు. బ్రహ్మానందం సినీ రంగంలో బాగా సంపాదించారట.. ఆ  వచ్చిన దానిని కొన్ని రియల్ ఎస్టేట్స్ లో కూడబెట్టినట్టు సమాచారం. దీంతో పాటు కొన్ని వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారట. మొత్తానికి బ్రహ్మానందం తన పారితోషికంలో సగాన్ని భూములపై ఇన్వెస్ట్ చేశారట. 

అంతే కాదు ఈయన స్థిర, చరాస్థులు అన్ని కలిపితే.. దాదాపు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారమే తప్పించి.. ఆయన ఆస్తులపై అఫీషియల్ వివరాలు మాత్రం తెలియదు. అంతేకాదు.. డబ్బు విషయంలో బ్రహ్మీ చాలా జాగ్రత్తగా ఉంటారు. వృధా ఖర్చులు లేకుండా చూసుకుంటారట. ఆయన క్రమశిక్షణ.. ఇన్ని ఆస్తులు కూడబెట్టడానికి కారణం అంటున్నారు సినీ జనాలు.  

బ్రహ్మానందం బర్త్ డే సీడీపీ.

 ప్రస్తుతం బ్రహ్మానందం ఆత్మకథ రాస్తున్నారు. చాలా తక్కువ టైమ్ లో 1250 సినిమాల్లో నటించారు బ్రహ్మానందం. ఇండస్ట్రీలోతనకు ఎదురైన మంచి, చెడు అనుభవాలను పుస్తకరూపంలో తీసుకురాబోతున్నారు బ్రహ్మీ.   త్వరలో సినీ ప్రముఖుల సమక్షంలోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు సమాచారం. 

click me!