పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న ప్రణీత సుభాష్.. క్యూట్ లుక్స్ తో కుర్ర హృదయాలకు గాలం..

First Published | Feb 2, 2023, 1:26 PM IST

యంగ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. మెరిసిపోయే సౌందర్యంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
 

సౌత్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో యంగ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) ఒకరు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి ఫేమ్  దక్కించుకున్నారు ప్రణీత.
 

‘బావ’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో మెరిసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, రామ్ పోతినేని సరసన ‘హాలో గురు ప్రేమకోసమే’ వంటి సినిమాల్లో నటించింది మెప్పించింది.


మరోవైపు ప్రణీతా కొన్నాళ్ల పాటు కుర్రాళ్ల కళల రాణిగానూ మారింది. తన అందం, క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. మెరిసిపోయే అందం, ఆకట్టుకునే కళ్లు, చిరునవ్వుకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఇక్కడా మంచి ఫాలోయింగ్  ఉంది.
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ ప్రణీత అభిమానులకు బాగా దగ్గరగానే ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఫిదా చేస్తోంది. పెళ్లై, పండంటి బిడ్డకు జన్మనిచ్చినా అందంతో అదరగొడుతోంది.

తాజాగా ప్రణీత పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వైట్ డ్రెస్ లో కన్నడ బ్యూటీ పాలరాతి బొమ్మలా మెరిసిపోతోంది. క్యూట్ లుక్స్, చిరునవ్వులు, మత్తు కళ్లతో కుర్ర గుండెల్ని దోచేస్తోంది. సింపుల్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. 

పెళ్లి, ప్రెగ్నెన్సీ తో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కేరీర్ లో మలయాళంలో తొలిసినిమా చేయబోతోంది. మలయాళం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సరసన ఆయన 148 చిత్రంలో నటించబోతోంది. దీంతో పాటు ‘రమణ అవతార’లోనూ నటిస్తోంది. 

Latest Videos

click me!