Kaikala Satyanarnayana: వందల సినిమాల్లో నటించిన కైకాల సంపాదించిన ఆస్తులు ఇవే... తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published : Dec 23, 2022, 10:06 AM ISTUpdated : Dec 23, 2022, 10:21 AM IST

కైకాల సత్యనారాయణ మృతితో ఒక తరం నటుల శకం ముగిసింది. టాలీవుడ్ సెకండ్ జనరేషన్ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింపజేశారు. అద్భుతమైన నటన, పాత్రలతో పరిశ్రమకు పేరు తెచ్చారు.

PREV
18
Kaikala Satyanarnayana: వందల సినిమాల్లో నటించిన కైకాల సంపాదించిన ఆస్తులు ఇవే... తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నటుడిగా కైకాల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు. చిన్నప్పటి నుండి నటనపై మక్కువ కలిగిన కైకాల సత్యనారాయణ నాటకాలు వేసేవారు. పరిణితి వచ్చాక ఆయన చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో సహాయకుడిగా చేరి పాత్రల కోసం దర్శకుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఎట్టకేలకు దేవదాసు చిత్ర నిర్మాత డి ఎల్ నారాయణ సిపాయి కూతురు మూవీలో చిన్న పాత్ర ఇచ్చారు. 
 

28

సినిమా విజయం సాధించకపోయినా కైకాల దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. ప్రత్యేకత ఉన్న నటుడు పరిశ్రమకు పనికొస్తాడని గుర్తించారు.అయినప్పటికీ ఆయనకు వెంటనే ఆఫర్స్ రాలేదు.  విఠలాచార్య దర్శకత్వంలో తెరకెక్కిన 'కనకదుర్గ పూజా మహిమ' చిత్రం కైకాల కెరీర్ ని మలుపు తిప్పింది. నటుడిగా నిలదొక్కుకునే అవకాశం ఇచ్చింది.

38
Kaikala Satyanarayana

అప్పటి నుండి కైకాల(Kaikala Satyanarnayana) వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్ గా బిజీ అయ్యారు. నటుడిగా ఫేమ్ వచ్చాక హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. అయితే విలన్ గానే ఆయన సక్సెస్ అయ్యారు. టాలీవుడ్ కరుడుగట్టిన విలన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు తరాల నటులకు ఆయన విలన్ గా చేశారు. 2019 లో విడుదలైన మహర్షి చిత్రం వరకు నటిస్తూనే ఉన్నారు. 
 

48


కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarnayana death) నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. పరిశ్రమలో సంపాదించిన డబ్బులు పరిశ్రమలోనే పెట్టుబడి పెట్టారు. రమా  ఫిలిమ్స్ పేరిట గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా కొన్ని సినిమాలు డబ్బులు తెస్తే మరికొన్ని చిత్రాలు నష్టాలు మిగిల్చాయి. 
 

58


తన ఇద్దరు కొడుకులను సత్యనారాయణ పరిశ్రమకు దూరంగా పెంచారు. సాధారణంగా నటుల వారసులు నటులు కావాలి అనుకుంటారు. సత్యనారాయణ కొడుకులు, కూతుళ్లు సినిమా ప్రపంచంలోకి రాలేదు. అయితే కెజిఎఫ్ చాప్టర్ 1 సత్యనారాయణ కుమారుల్లో ఒకరు తెలుగులో విడుదల చేశారు. సత్యనారాయణ కుమారులిద్దరూ వ్యాపారస్తులుగా స్థిరపడ్డారని సమాచారం. ఏనాడూ మీడియా ముందుకు రాని వీరి గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. 

68


సినిమాను కళగా చూసిన కైకాల సత్యనారాయణ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. వందల చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన సంపాదించింది తక్కువే అని తెలుస్తుంది. గత ఏడాది కైకాల తీవ్ర అనారోగ్యం భారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన ఆసుపత్రి ఖర్చులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేశారు. 

78


కైకాల సత్యనారాయణకు రెండు కార్లు ఉన్నాయి . దాదాపు  రూ. 67 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి ఎల్ సి క్లాస్ కారు ఉంది. అలాగే ఒక టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. దాని ధర రూ. 29 లక్షలు అని సమాచారం. 

88


సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున రెసిడెన్సీ గచ్చిబౌలిలో గల ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి ధర రూ. 1.5 కోట్లు ఉండొచ్చు. అంతకు మించి కైకాల సత్యనారాయణకు సంబంధించిన ఆస్తుల వివరాలపై పెద్దగా సమాచారం లేదు. 

click me!

Recommended Stories