Saturday Updates: వీరమల్లుపై నిధి అభిమానం, కీర్తి సురేష్ కొత్త ప్రయోగం.. మృణాల్, దేవరకొండ రొమాన్స్ షురూ

Published : Jul 15, 2023, 10:27 PM ISTUpdated : Jul 16, 2023, 06:36 AM IST

కీర్తి సురేష్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్లామర్ రోల్స్ చేస్తూనే కీర్తి సురేష్ అప్పుడప్పుడూ లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

PREV
17
Saturday Updates: వీరమల్లుపై నిధి అభిమానం, కీర్తి సురేష్ కొత్త ప్రయోగం.. మృణాల్, దేవరకొండ రొమాన్స్ షురూ

విశాల్ హ్యాట్రిక్ కాంబినేషన్ షురూ 

డైరెక్టర్ హరి దర్శకత్వంలో హీరో విశాల్ హ్యాట్రిక్ చిత్రం నేడు ప్రారంభం అయింది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విశాల్ ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చేశాడు. విశాల్ నుంచి మాస్ మూవీ వచ్చి చాలా కాలమే అవుతోంది. దర్శకుడు హరి విశాల్ లోని మాస్ యాంగిల్ ని బయట పెట్టబోతున్నారు. 

27

పవన్ ఫస్ట్ ఇన్స్టా పోస్ట్ పై నిధి అగర్వాల్ రెస్పాన్స్ 

పవన్ కళ్యాణ్ నేడు తన ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో పవన్ సినీప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని.. తనతో నటించిన నటీనటుల ఫొటోస్ ని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోలో హరిహరవీరమల్లు చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఉంది. దీనిపై నిధి అగర్వాల్ స్పందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో భాగమై...  ప్రతిభావంతులు, నిరాడంబరులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో `హరి హర వీరమల్లు ` చిత్రం లో స్క్రీన్ షేర్ చేసుకోవడం  గొప్ప అవకాశంగా భావిస్తూ ..ఈ అవకాశం కల్పించిన దర్శకులు  క్రిష్ గారికీ,  నిర్మాత ఏయమ్ రత్నం గారికీ  మరియు చిత్ర యూనిట్ సభ్యులు  అందరికీ  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.. అని పేర్కొంది. 

37

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మూవీ షూటింగ్ షురూ 

గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రెండవసారి నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభం అయింది. 2024 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా ఈ చిత్ర షూటింగ్ వేగంగా ఫినిష్ చేయనున్నారు. మృణాల్ ఠాకూర్ తొలిసారి విజయ్ దేవరకొండతో జతకట్టడంతో ఆసక్తి నెలకొంది. 

47

డెబ్యూ డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రయోగం 

కీర్తి సురేష్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్లామర్ రోల్స్ చేస్తూనే కీర్తి సురేష్ అప్పుడప్పుడూ లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. డెబ్యూ డైరెక్టర్ గణేష్ రాజ్ చెప్పిన థ్రిల్లర్ కథ నచ్చడంతో కీర్తి సురేష్ ఒకే చెప్పింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. 

57

బ్రో నుంచి తేజు, కేతిక శర్మ రొమాంటిక్ సాంగ్ 

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న 'బ్రో' చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌, మొదటి పాట 'మై డియర్ మార్కండేయ'కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు 'బ్రో' నుండి రెండవ పాట 'జాణవులే' విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్వరకర్త స్వయంగా కె ప్రణతితో కలిసి ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.'జాణవులే' పాట విడుదల కార్యక్రమం తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, ప్రముఖ నిర్మాత ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

67

మ్యూజిక్ వీడియోతో రాబోతున్న ప్రముఖ హీరో సుధాకర్ కొమాకుల  

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కొమాకుల 'మెమొరీస్' అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. 

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

77

ఆకట్టుకుంటున్న `డిటెక్టివ్ కార్తీక్` ట్రైలర్, ఈ నెల 21న సినిమా విడుదల

మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంధ్య అనే యువతి కూడా మిస్సింగ్ అవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న అబ్బాయి కార్తీక్ ఆమె మిస్సింగ్ కేసుతో పాటు పాటు స్కూల్ స్టూడెంట్ మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. కానీ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో డౌట్స్, హర్డిల్స్ ఎదురవుతాయి. ఎన్ని కోణాల్లో చూసినా క్లూస్ దొరకవు. ఇంత క్లిష్టమైన కేసును హీరో ఎలా సాల్వ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. స్మాల్ బడ్జెట్ లో కూడా టెక్నిక్ ఉంటే మేకింగ్ లో మంచి క్వాలిటీ తీసుకురావచ్చని ఈ చిత్ర ట్రైలర్ చూపించింది. 

Read more Photos on
click me!

Recommended Stories