Tollywood Melodies: మెలొడీ మాయలో పడిన టాలీవుడ్...మెస్మరైజ్ చేస్తున్న పాటలు

Published : Mar 04, 2022, 03:40 PM ISTUpdated : Mar 04, 2022, 03:46 PM IST

ఒక సినిమా సక్సెస్ లో  మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది పాటలే. 

PREV
17
Tollywood Melodies: మెలొడీ మాయలో పడిన టాలీవుడ్...మెస్మరైజ్ చేస్తున్న పాటలు

మాస్ క్లాస్ ఏ పాటలైనా సరే బాగుంటే చాలా ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. టాలీవుడ్ సినిమాల సక్సెస్ లో వాటి పాత్ర చాలా ఉంది. అమధ్య  సినిమాలన్నీ రొమాంటిక్ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్ , ఐటమ్ సాంగ్స్ తోనే నిండిపోతున్నాయి. అయితే ఈ ఫాస్ట్ బీట్ జమానా లో కూడా మంచి మెలొడీ సాంగ్స్ ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని మెలొడీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన పాటలేంటో చూసేద్దాం. 

27

ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో మోత మోగించేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు మళ్లీ మెలొడీ వైపు మళ్లుతున్నారు. ఆడియన్స్ కి ప్లజెంట్ ఫీల్ ఇచ్చే మెలొడీస్ తో ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ రాతలే పాట మ్యూజిక్ లవర్స్ ను వేరే లోకంలోకి తీసుకెళ్లింది. రాధేశ్యామ్ లాంటి లవ్ రొమాంటిక్ మూవీకి యాప్ట్ అయ్యేలా ఈ పాటను  ట్యూన్ చేశారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ రాధేశ్యామ్ లో అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ మెలొడీ సాంగ్ ఈ రాతలే ..ప్రేక్షకులను  ఆకట్టుకుంటోంది.

37

సినిమాలో ఎన్ని పాటలున్నా.. అన్ని బాగుండాలని లేదు. ప్రేక్షకుడికి మంచి మ్యూజిక్ మూడ్ ని క్రియేట్ చేసేది మాత్రం మెలొడీ పాటే. మహేష్ బాబు కూడా ఇలాంటి మెస్మరైజింగ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మహేష్ బాబు , కీర్తిసురేష్  జంటగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి సాంగ్ ..ఫీల్ గుడ్ మెలొడీ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమన్ కంపోజ్ చేసిన ఈపాట  మహేష్ బాబు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
 

47

బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న భీమ్లానాయక్  సినిమానుంచి కూడా బ్యూటిఫుల్ మెలొడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్  సినిమాల్లో ఈరేంజ్ మెలొడీ సాంగ్ వచ్చి చాలా కాలం అవుతుంది. అందుకే పవన్ , నిత్యా కాంబినేషన్లో వచ్చిన అంత ఇష్టమేంటయ్యా అనే ఫీల్ గుడ్ మెలొడీ సాంగ్ ఫాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవున్నారు. 

57

ఇక వరుస ఫెయిల్యూన్స్ తో ఎంతో ఇబ్బండు పడుతూ... సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నాడు హీరో  శర్వానంద్ . ఈ సారి రిలీజ్ అయ్యే తన సినిమాల్లో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి ప్లాన్ చేశారు. శర్వానంద్ ,రష్మిక జంటగా రిలీజ్ అయిన  ఆడవాళ్లూ మీకుజోహార్లు సినిమాలో ఓ మెలోడీ మంత్రం వేశారు. హీరోయిన్ ని వర్ణిస్తూ...లవబుల్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటు అంతే వాల్యుబుల్ లిరిక్స్ తో వచ్చిన ఆసమ్ సాంగ్ .. మెలొడీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. 
 

67

మెలొడీ సాంగ్స్ అంటే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే గుర్తుకు వచ్చే పేరు  సింగర్ సిద్ శ్రీరామ్. మోస్ట్లీ సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ మెలొడీయిస్ సాంగ్సే. అంతేకాదు ఇప్పటి వరరకూ సిద్ పాడిన మెలొడీ పాటలన్నీ సూపర్ హిట్టే . సినిమా పెద్దగా పరిచయం లేకపోయినా పాటతోనే సినిమాకు కావల్సిన హైప్ తెచ్చిపెడతారు సిద్ . లేటెస్ట్ గా షికారు సినిమాలో మనసుదారి మళ్లెనే అనే ఫీల్ గుడ్ మెలొడీ ని పాడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు.
 

77

ఫాస్ట్ బీట్ సాంగ్స్ ని ఇష్టపడే తమిళ్ హీరోలు కూడా ..ఈమధ్య మెలొడీ వైపు టర్న్ అయ్యారు. సూర్య, ప్రియాంకా జంటగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈటి సినిమా నుంచి గుండె కరిగెనయ్యో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించే సూర్య .. డిఫరెంట్ గెటప్స్ లో పాటకు ఫీల్ తెచ్చారు. ఇలా ప్రతీ సినిమాలో ఇప్పుడు మెలోడీ సాంగ్ ఉండటం ట్రెండ్ గా మారింది. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా మెలోడీ మంత్రంతో థియేటర్లకు రప్పిస్తున్నారు మేకర్స్. 

Read more Photos on
click me!

Recommended Stories