ఫ్యామిలీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన చిత్రాలు

First Published 22, May 2019, 5:37 PM IST

తెలుగులో కుటుంబ కథ చిత్రాలు ఎన్ని వచ్చినా అన్నింటికీ ఆదరణ ఉంటుంది. కాకపోతే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్ ని పండించాలి. అలా టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పోయింది కొన్ని చిత్రాలు ఇవే! 

శతమానం భవతి: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఉద్యోగాల కోసం ఫారెన్ లో సెటిల్ అయినా కన్నవారిని మరచిపోకూడదనే సందేశం ఈ చిత్రంలో ఉంది.
సన్నాఫ్ సత్యమూర్తి : అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన రెండవ చిత్రం ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో తండ్రి సెంటిమెంట్ ని బలంగా చూపించారు.
మనం : అక్కినేని ఫ్యామిలీతో దర్శకుడు విక్రమ్ కుమార్ చేసిన మ్యాజిక్ ఈ చిత్రం. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు : వెంకటేష్, మహేష్ బాబు కలసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడ్డారు. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది.
అత్తారింటికి దారేది : త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ అత్త సెంటిమెంట్ మెప్పించాడు.
మిస్టర్ పర్ఫెక్ట్ : ప్రభాస్, కాజల్ జంటగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో తాప్సి కూడా మరో హీరోయిన్ గా నటించింది.
బొమ్మరిల్లు : తండ్రులని బొమ్మరిల్లు ఫాదర్ అని పిలవడం ఈ చిత్రం నుంచే ప్రారంభించారు. ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్ తండ్రి కొడుకులుగా అద్భుత నటన కనబరిచారు.
సంక్రాంతి : వెంకటేష్, శ్రీకాంత్, స్నేహ, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది.
సంతోషం: నాగార్జున ఈ చిత్రంలో పూర్తి క్లాస్ లుక్ లో కనిపించాడు. ఫ్యామిలీ సెంటిమెంట్, వినోదం, సంగీతం ఇలా అని విభాగాల్లో ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. శ్రీయ శరన్, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించారు.
మురారి: కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఓ మెమొరబుల్ మూవీగా నిలిచింది.
కలిసుందాం రా: వెంకటేష్ నటించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఇది కూడా ఒకటి.
నిన్నే పెళ్లాడతా : నాగార్జున, టబు జంటగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతని కూడా మెప్పించింది.
బృందావనం: యంగ్ టైగర్ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ని చక్కగా పండించారు.