పోకిరి నుంచి సాహో వరకు.. బిగ్గెస్ట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

First Published Sep 7, 2019, 10:26 AM IST

కాలం వేగాన్ని అందుకుంటున్న ప్రతి ఏడాది ఎదో ఒక తెలుగు సినిమా కొత్త రికార్డులు క్రియేట్ . 2006లో పోకిరి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక మొన్న విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను అందుకుంది. 2006 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు ఇవే. 

2006లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహేష్ పోకిరి 41.2కోట్ల షేర్స్ ని అందించి ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
యమ దొంగ 2007: రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 30.1కోట్లను అందించింది. తారక్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్.
undefined
2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.
undefined
2009 మగధీర: అప్పట్లో సౌత్ ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన మగధీర 76కోట్లకు పైగా లాభాల్ని అందించింది. దర్శకుడు రాజమౌళి
undefined
2010 బాలకృష్ణ చాలా ప్లాప్స్ తరువాత బోయపాటి డైరెక్షన్ లో చేసిన సింహా సినిమా ఊహించని విధంగా 31.3కోట్ల లాభాల్ని అందించింది.
undefined
2011 మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దూకుడు. ఈ సినిమా 57.8కోట్ల లాభాల్ని అందించింది.
undefined
2012: ఎన్నో అపజయాల అనంతరం గబ్బర్ సింగ్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా 62.5కోట్ల షేర్స్ ని రాబట్టింది.
undefined
2013: అత్తారింటికి దారేది: త్రివిక్రమ్ డైరెక్షన్ లోప్ రెండవసారి పవర్ స్టార్ చేసిన చిత్రమిది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 76.8కోట్లను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
undefined
2014: రేసుగుర్రం: అల్లు అర్జున్ తన కెరీర్ లోనే ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ ఏడాది అత్యధికంగా ఈ సినిమా 59.8కోట్లను రాబట్టింది. దర్శకుడు సురేందర్ రెడ్డి.
undefined
2015:బాహుబలి: ఈ సినిమాతో రాజమౌళి ప్రభాస్ రేంజ్ ను మరో స్థాయికి పెంచాడు. తెలుగులోనే 191కోట్ల షేర్స్ ని అందించిన ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 311కోట్లను రాబట్టింది.
undefined
2016:జనతా గ్యారేజ్: కొరటాల శివ డైరెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 80.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.
undefined
2017:బాహుబలి 2: ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డునే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యధికంగా 865.1 కోట్ల షేర్స్ ని అందించింది.
undefined
2018:రంగస్థలం: కలెక్షన్స్ తోనే కాకుండా నటుడిగా కూడా రామ్ చరణ్ ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 125.2కోట్ల లాభాల్ని అందించింది.
undefined
2019: సాహో: సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. వరల్డ్ వైడ్ గా 170కోట్లకు పైగా ఈ సినిమా షేర్స్ ని అందించినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది.
undefined
click me!