ఆది ‘జోడి’మూవీ రివ్యూ!

First Published Sep 6, 2019, 3:22 PM IST

స్టార్ కాస్ట్ ఎలా ఉన్నా కొన్ని ట్రైలర్స్ తో ఇంట్రస్ట్ పుట్టిస్తాయి. సినిమా చూడాలని ఆసక్తి కలిగిస్తాయి. అలా ఈ మధ్య కాలంలో ఆది సినిమా థియోటర్ కు వెళ్లి  చూడాలనిపించాలి అనిపించింది మాత్రం ‘జోడి’నే. 

(Review By --సూర్య ప్రకాష్ జోశ్యుల) స్టార్ కాస్ట్ ఎలా ఉన్నా కొన్ని ట్రైలర్స్ తో ఇంట్రస్ట్ పుట్టిస్తాయి. సినిమా చూడాలని ఆసక్తి కలిగిస్తాయి. అలా ఈ మధ్య కాలంలో ఆది సినిమా థియోటర్ కు వెళ్లి చూడాలనిపించాలి అనిపించింది మాత్రం ‘జోడి’నే. అయితే అంత ఉత్సాహంగా వెళ్లిన సినిమాలో కంటెంట్ కూడా ఆ స్దాయిలో ఉంటే ఈజీగా పాసైపోతుంది. ఇంకొంచెం బాగుంటే హిట్టై పోతుంది. మరి ఈ ‘జోడి’లో అంత విషయం ఉందా..వరస ప్లాఫ్ ల్లో ఉన్న ఆదికు హిట్ ని ప్రసాదిస్తుందా, అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి : సాప్ట్ వేర్ ఇంజినీర్ కపిల్ (ఆది) ఫ్రెంచ్ క్లాస్ లు చెప్పే కాంచన మాల (శ్రర్ధ శ్రీనాథ్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొద్ది రోజులకు కపిల్ తో పీకలోతు ప్రేమలో మునుగుతుంది. ఇద్దరూ పెద్దలకు చెప్పి వివాహం చేసుకుందామనుకునే సమయంలో ఓ సమస్య వస్తుంది. కపిల్ తండ్రి కమలాకర్ (నరేష్)వల్లే గతంలో కాంచనమాల తండ్రి మరణించాడని రివీల్ అవుతుంది. అందుకు కారణం కమలాకర్ క్రికెట్ బెట్టింగ్ ల పిచ్చే అని తేలుతుంది. ఈ క్రమంలో అసలు కమలాకర్ ఆమె తండ్రి మరణానికి ఎలా కారణం అయ్యాడు. చివరకు ఇద్దరు ఇళ్ళలో వాళ్లు ఈ వివాహానికి ఒప్పుకున్నారా...కాంచనమాల ఈ పరిస్దితుల్లో ఎలా రెస్పాండ్ అయ్యింది. కపిల్ తన ప్రేమకు ఎదురైన ఈ సమస్యను ఎలా అధిగమించే ప్రయత్నం చేసాడన్నది తెరపై చూడాల్సిన మిగతా కథ.
undefined
ఆ కాలం కథ, అప్పటి స్క్రీన్ ప్లే అదనం : అప్పుడెప్పుడో రాసుకున్న కథని ఇన్నాళ్లకు నిర్మాత దొరికాడు కదా అని తెరకెక్కించినట్లు అనిపించే ఈ సినిమా ఈ మధ్యకాలంలో అరుదైపోయన కనువిప్పు కథల జానర్ లోకి చేరుతుంది. తండ్రి చెడు అలవాట్లకు బలైన ఒక కుటుంబాన్ని ఒప్పించి వాళ్లింటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడనే చిన్న పాయింట్ చుట్టూ తిరిగే పెద్ద కథ ఇది. ఇప్పటికీ వరకట్నం ఉండచ్చు కానీ దాని మీద సినిమా చేస్తే చూడటానికి ఎంత ఇబ్బందో ..ఇలాగే ఇలాంటి కాంప్లిక్ట్స్ చుట్టూ కథలు అల్లి ఒప్పించటం అంతే కష్టం. పోనీ కథ ఆ కాలం నాటిదే అని స్క్రీన్ ప్లే తో ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా అంటే ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీ...ఇంటర్వెల్ అందరూ ఊహించే ట్విస్ట్.
undefined
సెకండాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోషన్స్. ఈ నేపధ్యంలో ఇంట్రస్ట్ అనేది అసలు లేకుండా సాదా సీదాగా సాగుతుంది. పాతికేళ్ల క్రితం వచ్చినా కూడా ఈ సినిమా ఆదరించరేమో అనిపిస్తుంది. ఏదైమైనా తొలి చిత్రానికి ఇలాంటి కథతో సినిమా చెయ్యాలనే ధైర్యం మాత్రం ఆశ్చర్యకరమే.
undefined
హీరో,హీరోయిన్స్, మిగతా డిపార్ట్మెంట్స్: ఈ సినిమాలో ఆది ఎప్పిటిలాగే చేసుకుంటూపోయాడు. పొరపాటున కూడా కొత్తగా ట్రై చేయలేదు. ఇక శ్రధ్దా శ్రీనాధ్ విషయానికి వస్తే ..అసలు ఆమె జెర్సీలో చేసిన హీరోయన్ యేనే ఇంత పేలవంగా చేసిందేమిటి అనిపిస్తుంది.నరేష్ , గొల్లపూడి ,సిజ్జు పాత్రలకు తగ్గట్లు చేసుకుంటూ పోయారు.
undefined
సాంకేతికంగా ...ఈ సినిమా గొప్పగా లేదు. ఫణి కల్యాణ్‌ పాటలు డల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఒకాదానికి మరొకటి పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఎడిటర్ పై మనకు కోపం చాలా వస్తుంది. త్యాగరాజు డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. కొత్త దర్శకుడు విశ్వానాథ్ అరెగల కథ రాసుకోవటంలోనే కాదు దర్శకత్వంలోనూ బాగా వెనక బడ్డారు.
undefined
ఫైనల్ థాట్ : గవర్నమెంట్ వారు క్రికెట్ బెట్టింగ్ వల్ల నష్టాలు అనే ప్రజాప్రయోజనార్ద పబ్లిసిటీ కాంపైన్ కు ఉపయోగించుకోవచ్చు. అవార్డ్ లు గట్రా ఇచ్చుకోవచ్చు.
undefined
Rating: 1.55
undefined
click me!