కింగ్ నాగార్జున డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

Published : Mar 05, 2024, 05:34 PM IST

టాలీవుడ్ లో మన్మధుడు అంటే వెంటనే నాగార్జున గుర్తుకు వస్తాడు. కింగ్ గా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన ఈ సీనియర్ హీరో అన్ని రకాల పాత్రలు అవలీలగా చేయగలడు.. చేశారు కూడా. అయినా సరే కింగ్ కు ఇంకా చేయాల్సిన డ్రీమ్ రోల్ ఒకటి మిగిలిపోయిందట. ఏంటో తెలుసా అది..?   

PREV
15
కింగ్ నాగార్జున డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?
Nagarjuna-Amala

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. హీరోగా ఆయన చేయని డిఫరెంట్ రోల్స్ లేవు.. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున.. అటు భక్తి రస సినిమాలు కూడా చేసి చూపించాడు. మూడు పదుల వయస్సులోనే.. కమర్షియల్ హీరోగా వెలుగు వెలుగున్న టైమ్ లోఅన్నమయ్య  సినిమాతో.. అదరగొట్టాడు కింగ్.  

25

భక్తి రససినిమాలో నటించి మెప్పించాడు అంటే ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మాస్ యాక్షన్, లవ్ రొమాంటిక్, భక్తిరస చిత్రాలన్నింటిలో నటించి మెప్పించిన నటుడిగా నాగార్జునకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అయితే ఉంది. అయితే ఇన్ని రకాల గెటప్ లు ట్రై చేసిన నాగార్జునకు.. తాను చేయాల్సిన డ్రీమ్ రోల్ మాత్రం అలాగే ఉండిపోయిందట. 
 

35

ఒక్కసారైనా ఒక పాత్రలో నటించి మెప్పించాలని చూస్తున్నాడట. ఇంతకీ అతను ఆశగా ఎదరుచూస్తున్నఆ క్యారెక్టర్ ఏంటంటే.. అడ్వెంచర్ జానర్లో.. ఏదైనా రిస్కీ క్యారెక్టర్ తో..  సాహసోపేతమైన సినిమా ఒక్కటైనా చేయాలని ఉందట నాగార్జునకు. ఈ తరహా పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట నాగ్. కాని  ఆయనకు ఆపాత్ర దొరకడం లేదంటూ ఒక సందర్భంలో నాగ్ చెప్పినట్టు తెలుస్తోంది. 

45

తన కెరీర్ లో హీరోగా కొనసాగినంత కాలం.. నాగార్జున మాత్రం అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తునే ఉంటాడట. ఇప్పుడు అలాంటి పాత్ర తన దగ్గరికి తీసుకెళ్తే ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించడానికి తను సిద్ధంగా ఉన్నట్టు.. తెలుస్తోంది.  మొత్తానికైతే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలను చేస్తూ సీనియర్ హీరోల్లో మంచి బిజీగా ఉన్నాడు. 
 

55
Actor Nagarjuna

ఇక తొందర్లోనే నాగార్జున అడ్వెంచర్ జానర్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గానే నాగ్ నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. చాలా కాలం తరువాత కింగ్ కు ఈసినిమాతో హిట్ అచ్చింది. ఇదే ఊపుతో మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు  మన్మధుడు. 
 

click me!

Recommended Stories