నటన అంటే ఇది అని నిరూపించిన హీరోలు, వారి మల్టిపుల్ రోల్ చిత్రాలు

First Published 16, Jun 2019, 12:40 PM

హీరోల నటనా శక్తి అన్ని చిత్రాల్లో బయట పడదు. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రం, అందుకు తగ్గట్లుగా దర్శకుడు డిజైన్ చేసిన పాత్ర దొరకాలి. ముఖ్యంగా హీరోలకు దివత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంటుంది. అలాంటి అవకాశాలని అందిపుచ్చుకుని నటనలో చెలరేగిపోయిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే!

దాన వీర శూర కర్ణ : స్వర్గీయ నందమూరి తారక రామారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానా సినీ జీవితంలో ఎన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. దానవీర శూర కర్ణ చిత్రంలో కర్ణుడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు.
ముగ్గురు మొనగాళ్లు : మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. ఈ చిత్రంరాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కింది. ముగ్గురు మొనగాళ్లు చిత్రం చిరు కెరీర్ లో అద్భుత చిత్రంగా నిలిచిపోయింది.
హలో బ్రదర్ : కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్ లో,. సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన హలో బ్రదర్ చిత్రం మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఘనవిజయం సాధించింది. నాగార్జున ఈ చిత్రంలో ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ అందించారు.
సూర్యవంశం : విక్టరీ వెంకటేష్ అటు కామెడీ, ఇటు సెంటిమెంట్ పండించడంలో దిట్ట. సూర్యవంశం చిత్రంలో వెంకీ తండ్రిగా, కొడుకుగా డ్యూయెల్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది.
చెన్న కేశవరెడ్డి : నందమూరి నటసింహం బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని వివి వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో తండ్రిగా, కొడుకుగా బాలయ్య పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ చూడొచ్చు.
స్నేహం కోసం : మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించాడు. ఈ చిత్రంలో చిరు తండ్రి పాత్రలో అద్భుతమైన ఎమోషన్ పండించారు.
బిల్లా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రం బిల్లా. ఓ పాత్రలో ప్రభాస్ పవర్ ఫుల్ డాన్ గా మరో పాత్రలో సరదా కనిపిస్తాడు.
అదుర్స్ : ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది.
విక్రమార్కుడు : రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. రవితేజ ఈ చిత్రంలో ఓ పాత్రలోదొంగగా, మరో పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. రెండు పాత్రలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అపరిచితుడు : హీరో విక్రమ్ నటనకు, డెడికేషన్ కు అపరిచితుడు చిత్రం నిదర్శనం అని చెప్పొచ్చు. అపరిచితుడు, రాము, రెమో పాత్రల్లో విక్రమ్ చెలరేగి నటించాడు. ఈ చిత్రంతో విక్రమ్ ఉత్తమనటుడిగా పలు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.
దశావతారం : విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన అద్భుత ప్రయోగం దశావతారం చిత్రం. ఈ చిత్రంలో కమల్ 10 పాత్రల్లో అలవోకగా నటించారు.
జెంటిల్ మన్ : ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. నాని డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
అరుంధతి : అనుష్క శెట్టి కెరీర్ లో మైలురాయిగా నిలిచే చిత్రం అరుంధతి. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా అప్పట్లో ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. కోడి రామకృష్ణ తెరకేకించిన ఈ చిత్రంలో అనుష్క డ్యూయెల్ రోల్ లో నటించింది.
24: విక్రమ్ కుమార్ దర్శకత్వ ప్రతిభకు, సూర్య నటనకు నిదర్శనం 24 చిత్రం. ఈ చిత్రంలో సూర్య హీరోగా, తండ్రిగా, విలన్ గా అద్భుతమైన నటన కనబరిచాడు.
జై లవకుశ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో నటించాడు. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన అందరిని మెస్మరైజ్ చేసింది.