రోమాలు నిక్కబొడుచుకునేలా హీరోల ప్రసంగాలు.. ఏది బెస్ట్!

First Published Jun 20, 2019, 5:21 PM IST

కొన్ని సినిమాలు విజయం సాధించినా చూశామా.. ఎంజాయ్ చేశామా.. ఇక అంతే అన్నట్లుగా ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికి మరచిపోలేని విధంగా ఉంటాయి. ఆయా చిత్రాల్లోని కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తాయి. పంచ్ డైలాగులు పేల్చడం సులభమే. కానీ తమ నటనతో ఎక్కువ సమయం ప్రేక్షకుల అటెన్షన్ కోల్పోకుండా చేయడం చాలా కష్టం. ఈ చిత్రాల్లో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు ప్రేక్షకులని మెప్పించాయి. వాటిలో ఏది బెస్టో మీరే తేల్చుకోండి.. 

అపరిచితుడు : విలక్షణ నటుడు విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రం ఎప్పటికి ఓ ఆణిముత్యంగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో విక్రమ్ అపరిచితుడుగా ప్రజలతో మాట్లాడే సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో విక్రమ్ చెప్పే ప్రతి డైలాగ్ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.
undefined
లీడర్ : రానా నటించిన లీడర్ మూవీ పొలిటికల్ డ్రామాగా అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో క్లైమాస్ సన్నివేశంలో రానా నటన, అతడు చెప్పే డైలాగులు వింటే నిజమైన సీఎం ఇలా ఉంటే ఎలా బావుంటుందో అని అనిపిస్తుంది.
undefined
ఛత్రపతి : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ ఛత్రపతి. ఈ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశంలో ప్రభాస్ చెప్పే డైలాగులు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయి. అప్పటివరకు అణచివేతకు గురైన తన ప్రజలని ఉత్తేజపరిచేలా ప్రభాస్ చేసే ప్రసంగం అదుర్స్.
undefined
ఠాగూర్ :మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ అప్పట్లో అద్భుత విజయం సాధించింది. క్లైమాక్స్ లో కోర్టు సన్నివేశంలో చిరు నటవిశ్వరూపం ప్రదర్శించారు.
undefined
కెమెరామెన్ గంగతో రాంబాబు: పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. కానీ క్లైమాక్స్ లో పవన్ మీడియా ముందు యువతని ఉత్తేజ పరిచేలా చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.
undefined
బిజినెస్ మన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మన్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ లో మహేష్ నోట పూరి డైలాగులు బాగా పేలాయి.
undefined
బొమ్మరిల్లు : బొమ్మరిల్లు చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం సినిమాని మరో లెవల్ కు తీసుకువెళుతుంది. సిద్దార్థ్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ పోటీ పడి నటించారు. పిల్లల ఎదుగుదలలో తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అనే చక్కటి సందేశాన్ని బొమ్మరిల్లు భాస్కర్ అందించారు.
undefined
టెంపర్: టెంపర్ చిత్రానికి కోర్టు సన్నివేశం ప్రధాన ఆకర్షణ. ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ వల్ల అత్యాచారాలు చేసిన వారు ఎలా తప్పించుకుంటున్నారో తెలియజేస్తూ ఎన్టీఆర్ సెటైరికల్ గా చెప్పే డైలాగ్స్ అదుర్స్.
undefined
ధోని : ప్రకాష్ రాజ్ స్వీయ దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఆకాష్ పూరి ప్రకాష్ రాజ్ కొడుకుగా నటించాడు. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడే సన్నివేశం ఆలోచింపచేసే విధంగా ఉంటుంది.
undefined
రాఖీ : ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ కోర్టు సన్నివేశంలో ఎమోషనల్ నటనతో కట్టిపడేశాడు.
undefined
ప్రస్థానం : ఈ చిత్రంలో క్లైమాక్స్ లో సాయికుమార్ నటన మంచి అటెన్షన్ తీసుకుంటుంది.
undefined
గౌతమి పుత్ర శాతకర్ణి : ఈ చిత్రంలో బాలయ్య తన సైనికుల్ని ఉత్తేజపరిచేలా చెప్పే డైలాగులు అద్భుతంగా ఉంటాయి.
undefined
ప్రతినిధి: నారా రోహిత్ నటించిన ఈ పొలిటికల్ మూవీ ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ లో అటు ప్రజలని ఉద్దేశించి, రాజకీయ నాయకులని ఉద్దేశించి నారా రోహిత్ చేసే ప్రసంగం చాలా బావుంటుంది.
undefined
నేనే రాజు నేనే మంత్రి: ఈ చిత్రంలో ఉరికంబం ఎక్కే ముందు రానా నటన సినిమాకే హైలైట్ అనిపించే విధంగా ఉంటుంది.
undefined
click me!