2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్లు సాధించిన హీరోయిన్లు.. కనిపించకుండా పోయింది వీళ్ళే

Published : Apr 28, 2025, 03:33 PM IST

టాలీవుడ్ లో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

PREV
18
2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్లు సాధించిన హీరోయిన్లు.. కనిపించకుండా పోయింది వీళ్ళే
Tollywood Industry Hits

ఇండస్ట్రీ హిట్ చిత్రాలు అంటే ఫ్యాన్స్ ఎక్కువగా హీరోలనే గుర్తుంచుకుంటారు. హీరోయిన్లు అంతగా ఎవరికీ గుర్తుండరు. టాలీవుడ్ లో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రాలు, అందులో నటించిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. 

28
Simran

సిమ్రాన్  - కలిసుందాం రా, నరసింహ నాయుడు 

హీరోయిన్ సిమ్రాన్ అప్పట్లో యువత కలల రాణి. తెలుగులో సిమ్రాన్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 2000 సంవత్సరంలో సిమ్రాన్ వెంకటేష్ సరసన కలిసుందాం రా చిత్రంలో నటించింది. అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలయ్యతో నటించిన నరసింహ నాయుడు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

38

రిచా పల్లాడ్ - నువ్వే కావాలి 

హీరోయిన్ రిచా పల్లాడ్ లవర్ బాయ్ తరుణ్ సరసన నువ్వే కావాలి చిత్రంలో నటించింది. వీళ్లిద్దరికీ ఇదే డెబ్యూ మూవీ. అంతకు ముందు తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రిచా పల్లాడ్ నువ్వే కావాలి చిత్రం తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయ్యారు. 

48

సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ - ఇంద్ర 

మెగాస్టార్ చిరంజీవితో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఇంద్ర చిత్రంలో నటించారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ పోటీ పడి నటించారు. ఆర్తి అగర్వాల్ 2015లో ఊహించని విధంగా మరణించారు. 

 

58

ఇలియానా - పోకిరి 

టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చిన ఇలియానా మహేష్ బాబుకి జోడిగా పోకిరి చిత్రంలో నటించింది. టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేసేలా పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీనితో ఇలియానా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. చాలా కాలం క్రితమే ఇలియానా టాలీవుడ్ కి దూరమైంది. 

68

కాజల్ - మగధీర 

రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం మగధీర. అంతకు ముందు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి చిత్రాన్ని రెట్టింపు మార్జిన్ తో అధికమించి మగధీర సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

78
Samantha

సమంత, ప్రణీత సుభాష్ - అత్తారింటికి దారేది 

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. ఈ మూవీలో సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటించారు. 

 

88

అనుష్క శెట్టి - బాహుబలి 1, బాహుబలి 2

సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అనుష్క .. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో దేవసేన పాత్రలో అదరగొట్టింది. రాజమౌళి సృష్టించిన బాహుబలి రెండు భాగాలు దేశం మొత్తం సంచలనం సృష్టించాయి. ప్రభాస్ ని బాహుబలి 1,బాహుబలి 2 పాన్ ఇండియా స్టార్ గా మార్చేశాయి. 

Read more Photos on
click me!

Recommended Stories