టాలీవుడ్ హీరోలు తండ్రీకొడుకులుగా నటించిన క్రేజీ చిత్రాలు.. దేవర వీటిల్ని మించే హిట్ అవుతుందా

First Published | Sep 11, 2024, 11:27 AM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోలు తండ్రి కొడుకులుగా నటించిన సూపర్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్ హీరోలు తండ్రి కొడుకులుగా నటించిన సూపర్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. మరి దేవర చిత్రం గతంలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన చిత్రాలని మించేలా సూపర్ హిట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. తండ్రి కొడుకులుగా టాలీవుడ్ హీరోలు నటించిన చిత్రాల జాబితా ఇప్పడు చూద్దాం. 

జయం మనదేరా : విక్టరీ వెంకటేష్ సిల్వర్ స్క్రీన్ పై తండ్రి కొడుకుల సెంటిమెంట్ పండించడంలో దిట్ట. వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో తండ్రి పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


బాహుబలి : తెలుగు సినీ చరిత్రలో బాహుబలి మూవీ స్థానం వేరు. భాషా బేధాలని బ్రేక్ చేస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకుల పాత్రల్లో నటించారు. ప్రభాస్ పెర్ఫామెన్స్ గురించి చెప్పేదేముంది. ఈ చిత్రంతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.  

Also Read : రాజమౌళి మూవీ వల్ల నా పిల్లలు కూడా దగ్గరకి రావడం లేదు..ఆరోజే చనిపోవాల్సింది, ఇంత నరకమా

సోగ్గాడే చిన్ని నాయనా : కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్ లో చాలా చిత్రాల్లో నటించారు. కానీ తండ్రి కొడుకులుగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన తండ్రి పాత్ర బంగార్రాజు హైలైట్ అని చెప్పొచ్చు. బంగార్రాజు టైటిల్ తో ఈ చిత్రాన్ని సీక్వెల్ కూడా వచ్చింది. 

స్నేహం కోసం : మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా చిత్రాల్లో డ్యూయెల్ రోల్ లో నటించారు. చిరు తండ్రి కొడుకులుగా నటించిన సూపర్ హిట్ చిత్రం స్నేహం కోసం. ఈ మూవీలో చిరు తండ్రి పాత్రలో ప్రదర్శించిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. 

సూర్య వంశం : జయం మనదేరా కంటే ముందుగా వెంకటేష్ సూర్యవంశం చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు పాత్రలో వెంకటేష్ అమాయకంగా కనిపించే నటన చాలా బావుంటుంది. ఆ పాత్రలో ఎమోషనల్ డెప్త్ చాలా ఉంటుంది. మరోసారి వెంకటేష్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ లో తాను కింగ్ అని నిరూపించుకున్న చిత్రం సూర్య వంశం. 

సింహా : నందమూరి బాలకృష్ణ చాలా చిత్రాల్లో తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం సింహా చిత్రం గురించే. ఈ మూవీలో తండ్రిగా కొడుకుగా రెండు పాత్రల్లోనూ బాలయ్య అదరగొట్టారు. బోయపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలయ్య ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సరైన టైంలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

Devara Trailer

దేవర : ఇప్పుడు అందరి చూపు ఎన్టీఆర్ దేవర చిత్రంపైనే. ఎందుకంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలవుతోంది. గతంలో వచ్చిన తండ్రి కొడుకుల సెంటిమెంట్ చిత్రాలన్నింటికంటే దేవర బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో తండ్రి పాత్రలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. కొడుకు పాత్రలో పిరికి వాడిగా నటిస్తున్నాడు. ఆ టిస్ట్ ఏంటనేది సినిమాలోనే చూడాలి. 

Latest Videos

click me!