ప్రభాస్, మహేష్, రాంచరణ్, వరుణ్ పై ఇనుప పాదం మోపిన బాలీవుడ్ భామలు..వాళ్ళు నటిస్తే సినిమా అట్టర్ ఫ్లాప్

First Published | Jan 21, 2024, 11:55 AM IST

హీరోయిన్ల విషయంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో అలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. పలానా హీరోయిన్ నటిస్తే సినిమా ఫ్లాప్ అని.. ఆ హీరోయిన్ నటిస్తే గ్యారెంటీ హిట్ అని ముందే చెప్పేస్తుంటారు. ఇలా చాలా మంది హీరోయిన్లపై ఐరన్ లెగ్ ముద్ర కూడా పడింది. 

హీరోయిన్ల విషయంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో అలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. పలానా హీరోయిన్ నటిస్తే సినిమా ఫ్లాప్ అని.. ఆ హీరోయిన్ నటిస్తే గ్యారెంటీ హిట్ అని ముందే చెప్పేస్తుంటారు. ఇలా చాలా మంది హీరోయిన్లపై ఐరన్ లెగ్ ముద్ర కూడా పడింది. అయితే బాలీవుడ్ హీరోయిన్ల విషయంలో టాలీవుడ్ హీరోలకి ఎప్పుడూ టెన్షన్ తప్పదు. బాలీవుడ్ హీరోయిన్లతో కలసి నటిస్తే టాలీవుడ్ హీరోలకు సక్సెస్ రేట్ చాలా తక్కువ. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించిన చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

లైగర్ : లైగర్ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకి జోడిగా అనన్య పాండే నటించింది. విజయ్ దేవరకొండతో కలసి ఈ యంగ్ బ్యూటీ రొమాన్స్ లో రెచ్చిపోయింది. హాట్ హాట్ గా స్కిన్ షో చేస్తూ యువత మతి పోగొట్టేసింది. కానీ సినిమా మాత్రం బిగ్ డిజాస్టర్. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. 


ఆదిపురుష్ : చరిత్రలో నిలిచిపోతుందనుకున్న ఆదిపురుష్ చిత్రం తీవ్రంగా విమర్శల పాలైంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ జానకిగా నటించిన ఈ మూవీని డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. పౌరాణిక చిత్రం పైగా ప్రభాస్ పాత్రకి సరిపోయే పాత్ర కావడంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం రౌత్ డైరెక్షన్ వల్ల ఆదిపురుష్ చిత్రంపై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. సీతాదేవిగా నటించిన కృతి సనన్ కూడా ఆ రోల్ కి ఫిట్ కాదు అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఆదిపురుష్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. 

ఏక్ నిరంజన్ : పూరి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కొంచెం కొత్తదనం కోసం పూరి ఈ చిత్రంలో కంగనా రనౌత్ ని ట్రై చేసారు కానీ మూవీకి ఏవిధంగానూ కంగనా ప్లస్ కాలేదు. 

సాహో: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద చతికలబడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కానీ సినిమా మాత్రం బోల్తా పడింది. 

తుఫాన్: రాంచరణ్ కెరీర్ లోనే బిగ్ డిజాస్టర్ అంటే జంజీర్ మూవీ అని చెప్పొచ్చు. హాలీవుడ్ డైరెక్టర్ తో రాంచరణ్ నటించిన తొలి చిత్రం ఇది. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఏ అంశంలోనూ ఈ చిత్రం ఆకట్టుకోలేదు. 

లోఫర్ : ఇది కూడా పూరి జగన్నాధ్ చిత్రమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ దిశా పటాని నటించింది. దిశా పటాని గ్లామర్ జోరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే లోఫర్ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. 

1 నేనొక్కడినే : సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ డిజాస్టర్ అయినప్పటికీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా కృతి సనన్ నటించింది. 

Latest Videos

click me!