ఇక ఇప్పటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన యంగ్ హీరో నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా లో నాగచైతన్య ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ 1994లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కి రిమేక్‌గా తెరకెక్కింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.