ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. జీరో సైజ్ కోసం భామల తంటాలు

Published : Feb 02, 2022, 11:54 AM ISTUpdated : Feb 02, 2022, 12:04 PM IST

ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్నారు టాలీవుడ్ హీరోయిన్లు. అసలే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పిజిక్ విషయంలో కొంచెం తేడా వచ్చినా.. హీరోయిన్ గా అన్ ఫిట్ అనే ముద్ర పడిపోతుంది. అందుకే నోరు కట్టుకుని.. తిండి త్యాగం చేసుకుంటూ.. జిమ్ముల్లోనే ఎక్కవ టైమ్ స్పెండ్ చేస్తున్నారు హీరోయిన్లు. ఫిట్ నెస్ ను కాపాడకుంటున్నారు. మరి సూపర్ ఫిట్ గా మెయింటేన్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు...?

PREV
18
ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు..  జీరో సైజ్ కోసం భామల తంటాలు

ఏజ్ బార్ అవుతున్నా కొద్ది హీరోయిన్లలో మార్పులు సహజం. సీనియర్ హీరోయిన్ గా పేరు పడిన తరువాత వంటి మీద శ్రద్ద తగ్గుతుంది. కాని కొంత మంది సినియర్ హీరోయిన్లు మాత్రం ఎప్పటికీ ఫిజిక్ ను అలాగే మెయింటేన్ చేస్తుంటారు. అలాంటివారిలో సమంత ముందు ఉంటుంది. హీరోయిన్ గా రిటైర్ అయ్యి.. విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటూ.. తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటున్న సమంత. ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లై విడాకులు కూడా అయిపోయిన సమంత ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్ లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది సమంత. తనకు ఇష్టమైన సమోసాలను ముందు పెట్టుకుని మరీ.. కసిగా వర్కౌట్స్ చేస్తుంది సామ్. 34 ఏళ్ల వయస్సులో కూడ మెరిసిపోతోంది.

28

మొన్నటి వరకూ కొంచెం బొద్దగా కనిపించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య చాలా చేంజ్ అయ్యింది. సడెన్ గా రకుల్ లో మార్పుచూసి అందరూ షాక్ అయ్యారు. నిజంగా ఈమె రకులేనా ఇంకెవరైనాన అన్నంతలా మార్పు కనిపించింది ఆమెలో. అంతే కాదు  యోగా, జిమ్, అరోబిక్స్ ఇలా  రకరకాల రూట్లలో ఆమె ఫిట్ నెస్ ను కాపాడుకుంటుంది. అంతే కాదు ఆమధ్య సోషల్ మీడియాలో నెటిజన్లకు పాఠాలు కూడా చెప్పింది రకుల్.

38

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ముందు ఉంది పూజా హెగ్డే. పూజా ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హరివిల్లులా తన వంటిని వంచగల ప్లెక్సిబుల్ బాడీ పూజాది. స్టార్ హీరోయిన్ స్టేటస్ కాపాడుకోవాలి అన్నా.. ఎక్కువ కాల హీరోయిన్ గా మంచి అవకాశాలు పొందాలి అన్నా.. ఫిట్ నెస్ కంపల్సరీ. అందుకే పూజా ఫిట్ నెస్ మీద బాగా దృష్టి పెడుతుంది. రీసెంట్ గా తన జిమ్ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజా హెగ్డే.

48

ఫిట్ నెస్ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మికది స్పెషల్ రూట్. ఆమె స్టార్ హీరోయిన్ అవ్వక ముందు నుంచీ పక్కాగా రోజులు కొంత సమయం జిమ్ కు కేటాయిస్తుంది. రష్మిక డైలీ వర్కౌట్స్ ఎలా ఉంటాయి అంటే.. షూటింగ్ కోసం అవుడోర్ కు వెళినా సరే.. అక్కడ కూడా తనకు అందుబాటులో ఉన్న వాటితో జిమ్ చేయాల్సిందే. అంతే కాదు ఫిట్ నెస్ కు సంబంధించిన టిప్స్ ను కూడా ఆమె సోషల్ మీడియాలో నెటిజన్స్ తో పంచుకుంటారు. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ టైమ్ లో.. విజయ్ శాంతి లాంటి స్టార్.. రష్మిక వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్న రష్మిక బాలీవుడ్ ను ఆకట్టుకోవడానికి.. ఈ మధ్య తన బాడీ పై ఇంకాస్త శ్రద్ద ఎక్కువగా పెట్టింది.

58

కీర్తి సురేష్ అంటే చాలామందికి మహానటి గుర్తుకు వస్తుంది. మొదటి నుంచీ బొద్దగా.. ముద్దుగా ఉండే ఈ హీరోయి.. ఈ మధ్య తన అభిమానులకు షాక్ ఇచ్చింది. బన్నులా ఉండే కీర్తి సురేష్.. బక్కచిక్కిపోయి కనిపించింది. కీర్తి సురేష్ న్యూ మేకోవర్ చూసి అంతా షాక్ అయ్యారు. ఫెడ్ అవుట్ అవుతుంది అనుకుంటున్న టైమ్ లో వరుస అవకాశాలు సాధిస్తోంది కీర్తి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాటలో నటిస్తోంది. నాజూగ్గా తయారు అయిన మలయాళ భామ అందరిని ఆకర్షిస్తోంది.

68

35 ఏళ్లు వచ్చినా.. చెక్కు చెదరని శిల్పంలా ఉంటుంది  స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. మొదటి నుంచీ శ్రుతీ జీరోసౌజ్ నే మెయింటేన్ చేస్తుంది. షూటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్లినా.. వెకేషన్ కోసం బయటి దేశాకు వెళ్ళినా.. తన వర్కౌట్స్ ను మిస్ అవ్వదు శ్రుతి హాసన్. ప్రతీ సినిమాలో తన జీరో సైజ్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈమధ్య తన కొత్త ప్రియుడు శాంతను తో కలిసి వర్కౌట్స్ చేస్తూ.. ఆ వీడియోలను శేర్ చేస్తుంది కోలీవుడ్ భామ.

78

ఈ మధ్య ఫిట్ నెస్ మీద ఎక్కవగా దృష్టి పెట్టిన హీరోయిన్లలో రాశీ ఖన్నా కూడా చేరిపోయింది. ఫస్ట్ నుంచీ బొద్దుగా కేకు ముక్కలా ఉండే రాశీ.. ఈమధ్య చాలా మారిపోయింది. చాలా తగ్గిపోయింది. బ్యూటీ పాడవకుండా.. వెయిట్ తగ్గించేసింది. బొద్దుగా ఉండే రాశీ.. నాజూగ్గా తయారయ్యింది. అవకాశాలు తగ్గిపోతుండటంతో.. ఫిట్ నెస్ మంత్రం జపించింది రాశీ ఖన్నా. తను అనుకున్నట్టు గానే.. ప్రస్తుతం రాశీ కెరీర్ స్పీడ్ అందుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు సాధిస్తోంది.

88

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మగమనసుల ప్రాణాలు తోడేసింది పాయల్ రాజ్ పుత్. ఆమె సోయగానికి ఫిదా అవ్వని వారంటూ ఉండరు. నాజూకు నడువంపులతో పిచ్చెక్కించే పాయల్.. ఫస్ట్ నుంచీ అదే ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. కొంచెం కూడా మార్పులేకుండా తన బాడీ స్ట్రక్చర్ ను మెయింటేన్ చేస్తుంది. పాయల్ తో పాటు మరికొంతమంది హీరోయిన్లు ఫిట్ నెస్ పై గట్టిగానే దృష్టి పెట్టారు. అవకాశాలు లేకపోయినా... ఈషా రెబ్బ, రీతూ వర్మ లాంటిస్టార్స్ కూడా తమ ఫిట్ నెస్ ను కాపాడుకోవడం కోసం తెగ కష్టపడుతున్నారు.

click me!

Recommended Stories