టాలీవుడ్ దర్శకుల జీతాలు ఎంతో తెలుసా?

First Published Mar 7, 2019, 4:32 PM IST

ఈ రోజుల్లో హీరోలతో సమానంగా దర్శకులు కూడా గట్టి రెమ్యునరేషన్ ని లాగేస్తున్నారు. కాకపోతే వారికి కథలను సెట్ చేసుకోవడానికి మినిమమ్ రెండేళ్లు పడుతోంది. అందుకే మినిమమ్ గ్యారెంటీ కథలతో వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకుల వేతనం ఈ లెవెల్లో ఉందని ఒక అంచనా.... అయితే అది ప్రతి సినిమాకు మారుతూ వస్తోంది.

ఈ రోజుల్లో హీరోలతో సమానంగా దర్శకులు కూడా గట్టి రెమ్యునరేషన్ ని లాగేస్తున్నారు. కాకపోతే వారికి కథలను సెట్ చేసుకోవడానికి మినిమమ్ రెండేళ్లు పడుతోంది. అందుకే మినిమమ్ గ్యారెంటీ కథలతో వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకుల వేతనం ఈ లెవెల్లో ఉందని ఒక అంచనా.... అయితే అది ప్రతి సినిమాకు మారుతూ వస్తోంది.
undefined
ఎస్ఎస్. రాజమౌళి: బాహుబలికి ముందు 20కోట్లకు పైగా తీసుకున్న జక్కన్న బాహుబలి రెండు భాగాలకు కలిపి 50 కోట్లకు పైగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక RRR అది కాస్తా డబుల్ అయినట్లు టాక్.
undefined
త్రివిక్రమ్: అత్తరింటికి దారేది సినిమాతో త్రివిక్రమ్ పేమెంట్ 20 కోట్లకు పెరిగింది. ఆ తరువాత కూడా సేఫ్ జోన్ లో అదే నెంబర్ ను మెయింటైన్ చేస్తున్నారు.
undefined
పూరి జగన్నాథ్: 2000వ సంవత్సరంలో సినిమాలను స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా ఖాళీగా లేడు. టెంపర్ వరకు మినిమమ్ 12 కోట్ల పారితోషికంతో కెరీర్ ను నెట్టుకొచ్చిన పూరి ఇప్పుడు 10 లోపే తీసుకుంటున్నట్లు సమాచారం.
undefined
బోయపాటి శ్రీను: సరైనోడు సినిమాతో తాను కూడా 100 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలనని నిరూపించిన బోయపాటి 10 నుంచి 14 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
undefined
వివి.వినాయక్: ఠాగూర్ హిట్ తరువాత అప్పట్లో సౌత్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న దర్శకుల్లో వినాయక్ ఒకరు. అఖిల్ - ఖైదీ నెంబర్ 150వరకు కూడా 12 కోట్ల వరకు ఫీజు తీసుకున్న వినాయక్ ఇంటిలిజెంట్ సినిమాతో సైలెంట్ అయిపోయారు. తన సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే ఆదుకోవడంలో ఈ దర్శకుడు ముందుంటాడు.
undefined
సుకుమార్: రంగస్థలం సినిమాతో 200 కోట్ల బిజినెస్ ను చూపించిన సుకుమార్ రేట్ 15 కోట్లకు పెరిగిందని టాక్.
undefined
కొరటాల శివ: వరుస సక్సెస్ లతో మంచి ఉపుమీదున్న కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడు.
undefined
F2 అనిల్ రావిపూడి: వరుస సక్సెస్ లు అందుకుంటున్న ఈ దర్శకుడిని దిల్ రాజు వదలడం లేదు. 3 కోట్లకు పైగా మొన్నటివరకు అందుకున్న ఈ దర్శకుడికి F2 సక్సెస్ అనంతరం బయటి నిర్మాతలు 5 - 7 కోట్లవరకు అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
పరశురామ్: గీతగోవిందం సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడికి అంతకు ముందు వరకు కోటి కూడా ఇవ్వలేదు. కానీ ఆ సినిమా అనంతరం 7 కోట్లకు పైగా బడా నిర్మాతలు అఫర్ చేస్తున్నారు.
undefined
క్రిష్: కంచె - గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో ఇదివరకు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న క్రిష్ కంగనా నటించిన మణికర్ణిక సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే చివరలో ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి రెండు భాగాలకు కలిపి అదే రేంజ్ లో వేతనాన్ని అందుకున్న క్రిష్ ఇప్పుడు తగ్గించినట్లు సమాచారం.
undefined
శ్రీను వైట్ల:ఆగడు సినిమాతో ప్లాప్ అందుకున్న శ్రీను వైట్ల అప్పటివరకు 10 కోట్ల రేంజ్ తో వచ్చారు. కానీ ఆ తరువాత వరుస డిజాస్టర్స్ తో ఇటీవల వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాకు రెమ్యునరేషన్ 70% వరకు తగ్గించినట్లు రూమర్స్ వచ్చాయి.
undefined
సురేందర్ రెడ్డి: సైరా కోసం ఈ దర్శకుడు 10 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.
undefined
హరీష్ శంకర్: మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే ఈ దర్శకుడు గబ్బర్ సింగ్ తరువాత 5 కోట్లకు పెంచేసి అప్పటి నుంచి రేట్ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు.
undefined
శేఖర్ కమ్ముల: ఫిదా సినిమా ముందు వరకు ఈ దర్శకుడు సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేసి మినిమమ్ లాభాలను అందుకున్నారు. ఇక ఫిదా సినిమాకు 2 కోట్ల లోపే అందుకున్నట్లు టాక్. నెక్స్ట్ సినిమాకు 5 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.
undefined
వంశీ పైడిపల్లి: ఊపిరి సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడు మహేష్ 25వ సినిమా మహర్షికి 8కోట్ల వరకు వేతనాన్ని అందుకుంటున్నట్లు టాక్.
undefined
బాబీ(KS.రవీంద్ర): జై లవకుశ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ చైతు - వెంకీలను కలిపి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
undefined
సందీప్ వంగ: మొదటి సినిమా అర్జున్ రెడ్డితో 30 కోట్ల లాభాలను అందించిన సందీప్ కు నిర్మాతల నుంచి ఒకేసారి 3- 5 కొట్ల వరకు ఆఫర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో చేస్తోన్న అర్జున్ రెడ్డి రీమేక్ కు 3 కోట్లు అందుకుంటున్నాడట.
undefined
సంకల్ప్ రెడ్డి: మొదటి సినిమా ఘాజి సినిమాకు పెద్దగా పారితోషికాన్ని తీసుకొని సంకల్ప్ నెక్స్ట్ సినిమా అంతరిక్షంకు మాత్రం 2 కోట్లు తీసుకున్నాడట. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు.
undefined
click me!