టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ‘అఖండ’ భామ ప్రగ్యా జైశ్వాల్ (Pragya jaiswal) శివరాత్రి పర్వదినాన చెన్నైలోని కోయంబత్తూరులో గల ఆదియోగి స్టాట్యూను దర్శించుకున్నారు. అంత్యంత ఎత్తైన మహాశుడి విగ్రహం ముందుకు పద్మాసనం వేశారు. శివ ధ్యానం చేస్తున్నట్టుగా ఫొటోకు పోజుకూడా ఇచ్చారు. ఆ పిక్ ను అభిమానులతో పంచుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుడు అందరికీ ధైర్యం,సుఖఃసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.