ట్రెడిషనల్ లుక్ లో 'సార్' హీరోయిన్.. చిరునవ్వులు చిందిస్తూ సంయుక్త మీనన్ మహా శివరాత్రి విషెస్

Published : Feb 18, 2023, 01:25 PM IST

వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది.

PREV
18
ట్రెడిషనల్ లుక్ లో 'సార్' హీరోయిన్.. చిరునవ్వులు చిందిస్తూ సంయుక్త మీనన్ మహా శివరాత్రి విషెస్

యుంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడి హవా మొదలైంది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. 

28

టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సంయుక్త మీనన్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి. 

 

38

వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సంయుక్త మీనన్ నటించిన సార్ చిత్రం కూడా పంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. 

48

నేడు మహా శివరాత్రి సందర్భంగా సంయుక్త మీనన్ ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. వైట్ చుడిదార్ లో మెరుపులు మెరిపిస్తూ సంయుక్త  ఫోజులు ఇచ్చింది. చూడముచ్చటగా ఉన్న సంయుక్త లుక్స్ వైరల్ అవుతున్నాయి. 

 

58

అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహా శివుడు ఆశీస్సులు అందరికి అందాలు అంటూ పోస్ట్ పెట్టింది. సార్ చిత్రం లో ధనుష్ సరసన సంయుక్త నటించి మెప్పించింది. 

68

సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి. 

78

భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా సంయుక్త నటించింది. ఆ చిత్రంలో సంయుక్త ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు బింబిసారలో కూడా సంయుక్త నటన గురించి మంచి విషయాలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో  సార్ చిత్రం తెరకెక్కింది.  

88

తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా సార్ రూపొందింది. ఫిబ్రవరి 17న రిలీజైన ఈ చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అంటే సంయుక్త మీనన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే. 

click me!

Recommended Stories