కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిశా పటానీ షికార్లు.. ముంబైలో సందడి.. వైరల్ గా మారిన ఫొటోలు

First Published | Aug 25, 2023, 8:09 PM IST

బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. ఇద్దరూ ఒకే  కారులో వెళ్లడంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బీటౌన్ లో హాట్ టాపిక్ గ్గా మారింది.
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కెరీర్ (Kriti Sanon)  తెలుగు చిత్రంతోనే మొదలైంది. ‘లోఫర్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి వరుసగా సినిమా చేస్తోంది. 
 

ప్రస్తుతం మళ్లీ సౌత్ సినిమాల్లో కృతి సనన్ అవకాశాలు అందుకుంటోంది. భారీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటోంది. ఇలా కెరీర్ ను జోరుగా సాగిస్తోంది. మరోవైపు తన పర్సనల్ లైఫ్ తోనూ ఈ ముద్దుగుమ్మ పేరు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.
 


దిశా పటానీ ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారి బ్రేకప్ తర్వాత ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ అలెక్సాండర్ అలెక్స్ పేరు వినిపించింది. ప్రస్తుతం అతనితోనే డేటింగ్ లో ఉన్నట్టు బీట్ టౌన్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

ఈ క్రమంలోనే తాజాగా ముంబై కేఫ్ లో అలెక్స్ తో కలిసి దిశా పటానీ కనిపించింది. హోటల్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఇద్దరూ ఒకే కారులో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఇద్దరూ క్యాజువల్ వేర్స్ లో అట్రాక్టివ్ లుక్ లో కనిపించారు. 

మరోవైపు దిశా పటానీ వైట్ క్రాప్డ్ టాప్ ధరించి గ్లామర్ మెరుపులు మెరిపించింది. డెనీమ్ లూజ్ ఫిట్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ నూ సొంతం చేసుకుంది. ఇక అలెక్స్ వైట్ కట్ బనియన్, జీన్స్ లో కనిపించారు. ఇద్దరి లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 

ఇక దిశాపటానీ బాలీవుడ్ లో వరుస చిత్రాలతో సందడి చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలపైనా ఫోకస్ పెట్టింది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న Kalki 2898 ADలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళంలో సూర్య సరసన ‘కంగువా’లోనూ కథానాయికగా ఉంది. ఇక హిందీలో ‘యోదా’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 
 

Latest Videos

click me!