Shraddha Das Item Song : ఇన్నాళ్లకు శ్రద్ధా దాస్ ఐటెం సాంగ్... ఈసాంగ్ చాలా స్పెషల్ గురూ!

Published : Mar 04, 2024, 05:36 PM IST

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das)  చాలా కాలం తర్వాత వెండితెరపై స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోబోతున్నారు. ఈసారి వచ్చే సాంగ్ మరింత స్పెషల్ గా ఉండనుంది. 

PREV
18
Shraddha Das Item Song : ఇన్నాళ్లకు శ్రద్ధా దాస్ ఐటెం సాంగ్... ఈసాంగ్ చాలా స్పెషల్ గురూ!

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. తన సినీ ప్రయాణాన్నిటాలీవుడ్ నుంచే ప్రారంభించినా సరైన సక్సెస్ ను చూడలేకపోయింది. కానీ విభిన్న పాత్రలు పోషిస్తూ అలరించింది. 

28

‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. గ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది. తన అందంతో ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.

38

అలాగే పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, అల్లు అర్జున్ నటించిన ‘డార్లింగ్’, ‘ఆర్య2’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 

48

మరోవైపు ‘మొగుడు’ వంటి తదితర చిత్రాల్లోనూ బోల్డ్ సీన్లలో నటించి ఫ్యూజులు ఎగరగొట్టేసింది. కానీ పెద్దగా ఆమె సినిమాలు  సక్సెస్ కాకపోవడంతో ఆ మధ్యలో ఆఫర్లు అందలేకపోయింది. 

58

ఢీ డ్యాన్స్ షోతో బుల్లితెరపై అలరించింది. స్మాల్ స్క్రీన్ పైనా తన జడ్జీమెంట్, అందంతో మతులు పోగొట్టింది. ఇదిలా ఉంటే... ఇప్పుడిప్పుడు మళ్లీ వరుస చిత్రాలతో అలరిస్తోంది. 

68

చివరిగా ‘ఖాకీ’ అనే హిందీ సిరీస్ లో మెరిసింది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’ Paarijatha Parvam)అనే  సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

78

రంగ్ రంగ్ రంగీలా (Rang Rang Rangeela) అనే ఐటెం సాంగ్ తో ఊర్రూతలూగించనుంది. మరోవైపు ఈ సాంగ్ ను తనే స్వయంగా పాడటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంతోష్ కంబంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.  

88

అయితే గతంలో శ్రద్ధా దాస్ ‘డిక్టేటర్’, అంతకు ముందు ‘ఆర్య2’లో అందాలు ఆరబోసే డాన్స్ లు చేసింది. ఇక చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో అలరించబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories