ప్రియాంక మోహన్ లేటెస్ట్ లుక్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ట్రెండ్ సెట్ చేస్తోందిగా!

First Published Mar 23, 2024, 11:10 PM IST

యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)  వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ ను చేజిక్కించుకుంటోంది.

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him Og)లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సుజీతా్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ తో నటిస్తుండటంతో ప్రియాంకకు టాలీవుడ్ లో మంచి రోజులు వచ్చాయంటున్నారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని (Nani) సరసన కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ‘సరిపోదా శనివారం’ (Saripodaa Sanivaaram) రూపుదిద్దుకుంటోంది.

ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రియాంక బిజీగా ఉన్నారు. ఈక్రమంలో సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో దుమ్ములేపుతోంది.

తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో బెడ్ పై కిర్రాక్ గా ఫోజులిచ్చి ఆకట్టుకుంది. తన లేటెస్ట్ స్టిల్స్ కు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

click me!