టాలీవుడ్ నటి, స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రియుడు సోహెల్ కతూరియాతో ఏడాది కిందనే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది. చివరిగా ‘మై నేమ్ ఈజ్ శృతి’, ‘105 మినిట్స్’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. నెక్ట్స్ రాబోయే సినిమాలతో బిజీ అయ్యింది.
ఈ క్రమంలో హన్సికా మోత్వానీ తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది.
ఇక తాజాగా మాత్రం స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దర్శనమిచ్చింది. ఫస్ట్ టైమ్ యాపిల్ బ్యూటీ స్విమ్ సూట్ లో ఇలా మెరిసింది. ఫొటోలకు ఆకట్టుకునేలా ఫోజులిచ్చింది.
హన్సికా లేటెస్ట్ లుక్ పై నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్ట్స్ ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘మ్యాన్’ వంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.