యోగాపై ఆసక్తి తెప్పిస్తున్న కీర్తి సురేష్.. ఆసనాలతో అదరహో అనిపిస్తున్న కళావతి..

Published : Jun 21, 2022, 06:20 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) యోగా ఫోజులతో ఆకట్టుకుంటోంది. కఠినమైన యోగాసనాలు వేస్తూ మతిపోగొడుతోంది. యోగాపై ఆసక్తి పెరిగేలా చేస్తోంది.   

PREV
17
యోగాపై ఆసక్తి తెప్పిస్తున్న కీర్తి సురేష్.. ఆసనాలతో అదరహో అనిపిస్తున్న కళావతి..

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 (International Yoga Day 2022) ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం మే27న యెగా ఉత్సవ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మే 21 (ఈ రోజు) వరకు కొనసాగించారు. 
 

27

అయితే యోగా దినోత్సవంలో టాలీవుడ్ స్టార్స్ కూడా భాగస్వాములయ్యారు. ఇప్పటికే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నందమూరి బాలక‌ృష్ణ యోగాసనాలు వేశారు.

37

అలాగే హీరోయిన్లు సోనాల్ చౌహాన్, అనన్య నాగిళ్ల, మంచు లక్ష్మి తమ నివాసాల్లోనే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా యోగాసనాలతో కూడిన వీడియోను తన అభిమానులతో పంచుకుంది.

47

కీర్తి సురేష్ ఎప్పుడూ ఫిట్ గా ఉండేందుకు యోగానే కారణమనిపిస్తోంది. ఎందుకంటే తన పోస్ట్ చేసిన వీడియోలో సర్వ యోగాసనాలు ఉన్నాయి. నియమం తప్పకుండా రోజూ ఆ యోగాసనాలు వేస్తే తప్పకుండా మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 

57

ఇలా కీర్తి సురేష్.. సూర్య రష్మి ఇంట్లో పడే ప్రదేశంలో యోగా మ్యాట్ పై ఆసనాలు వేసింది. శరీరంలోని ప్రతి భాగం కదిలేలా.. ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేసేలా యోగాసనాలు వేసింది. పదికి పైగా పోజులతో కీర్తి యోగాపై ఆసక్తిని పెంచుతోంది. కళావతి చాలా యాక్టివ్ గా యోగా చేయడం పట్ల నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 
 

67

ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. ఆడియెన్స్, తన అభిమానులందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. వీడియో షేర్ చేస్తూ  ‘యోగాతో స్వీయ ప్రయాణం, సొంతంగా, నా కోసం’ అంటూ క్యాప్షన్లు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

77

కీర్తి సురేష్ ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) సరసన ‘సర్కారు వారి పాట’లో నటిచింది.  చాలా కాలం తర్వాత కీర్తికి Sarkaru Vaari Paata మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో  నటిస్తోంది. మెగా స్టార్ తోనూ ‘భోళా శంకర్’లో కనిపించనుంది. 
 

click me!

Recommended Stories