సీఎం సీఎం సీఎం.. పవన్, ఎన్టీఆర్ అభిమానుల బలమైన ఎమోషన్... వాళ్లే ఎందుకు, మహేష్, ప్రభాస్ కాకూడదా?

Published : Jun 21, 2022, 04:48 PM IST

సినిమా హీరోలు,హీరోయిన్స్ సీఎంలు కావడం సౌత్ ఇండియాలో మొదలైన ట్రెండ్. కోలీవుడ్ స్టార్ ఎంజీఆర్ తో మొదలైన ఈ ట్రెండ్ ఎన్టీఆర్, జయలలితల వరకు  కొనసాగింది. వాళ్ళ స్పూర్తితో సీఎం పీఠం అధిరోహించాలని చాలా మంది ప్రయత్నం చేశారు. వారిలో చిరంజీవి, రజినీకాంత్ అంత సులభం కాదని గ్రహించిన విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు పరాభవాల తర్వాత కూడా పట్టువీడకుండా పోరాడుతున్నారు.

PREV
110
సీఎం సీఎం సీఎం.. పవన్, ఎన్టీఆర్ అభిమానుల బలమైన ఎమోషన్... వాళ్లే ఎందుకు, మహేష్, ప్రభాస్ కాకూడదా?

టాలీవుడ్ నుండి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సీఎం కావాలనుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలో పది మంది స్టార్ హీరోలు ఉన్నా ఆ సీఎం ఎమోషన్ మాత్రం ఇద్దరు హీరోల అభిమానులకు మాత్రమే ఉంది. అందులో ఒకరు పవన్ కళ్యాణ్, రెండు ఎన్టీఆర్. ,మరి ఇంత మంది స్టార్ హీరోలు ఉండగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఎందుకు కోరుకుంటున్నారు. వాళ్ళను మాత్రమే ఈ సీఎం ఎమోషన్ ఎందుకు వెంటాడుతుంది అంటే... దానికి ప్రధాన కారణం సామాజిక సమీకరణాలే.

210


 ఎన్టీఆర్(NTR), పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గమనిస్తే... వాళ్ళ సామాజిక వర్గానికి చెందివారే అధికంగా ఉంటారు. కొద్దిమంది ఇతర సామాజిక వర్గాలకు చెందినవారై ఉంటారు. దశాబ్దాలుగా మెగా నందమూరి కుటుంబాల మధ్య ఫ్యాన్ వార్ కి కారణం ఇదే. వీరు హీరోల మధ్య పోటీగా కాకుండా రెండు సామాజిక వర్గాల ఆధిపత్య పోరుగా చూస్తారు. ఒకే రోజు నందమూరి, మెగా హీరోల చిత్రాలు విడుదలైతే జయాపజయాల విషయంలో వీరి ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్ గా ఉంటాయి. 

310


ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకొని మరింత బలంగా పార్టీని తీర్చిదిద్దారు.వాళ్లలో కాపు సామాజిక వర్గం కూడా భాగమైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉండేవారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి, టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ సీఎం పీఠం ఎక్కుతాడు. 

410


ఇది అతిపెద్ద ఓటు బ్యాంకు కలిగిన కాపుల అసహనానికి కారణమైంది. మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా సీఎం కావాలనేది వాళ్ళ బలమైన ఎమోషన్. అక్కడి నుండి పుట్టిందే చిరంజీవి ప్రజారాజ్యం. ఎన్టీఆర్ తర్వాత అంతటి స్టార్ డమ్ కలిగిన చిరంజీవి (Chiranjeevi)సీఎం కావడం ఖాయమని వారు గట్టిగా నమ్మారు. సహనంగా ఉంటే చిరంజీవితో పాటు ఆ సామాజిక వర్గం కోరిక నెరవేరేదే. వైఎస్సార్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనిచ్చితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో చిరంజీవి కింగ్ మేకర్ అయ్యేవాడు. కానీ చిరంజీవి అప్పటికే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 

510

జనసేన పార్టీ (Janasena Party)ఆవిర్భావంతో ఆ సామాజిక వర్గ ఆశలు మరలా పురుడు పోసుకున్నాయి. అయితే చిరంజీవిపై ఉన్నంత నమ్మకం వాళ్లకు పవన్ పై కలగలేదు. పార్టీ పెట్టడంతోనే పవన్ చంద్రబాబుకు మద్దతు తెలిపి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇది కూడా పవన్ పై నమ్మకం సన్నగిల్లడానికి ఒక కారణం. పవన్ సీఎం కావాలని కోరుకునే డై హార్డ్ ఫ్యాన్స్... పొత్తులు వద్దంటారు. పదేళ్ల తర్వాతైనా మనం రాజకీయంగా సక్సెస్ సాధిస్తాం. మీరు సీఎం అవుతారు, కాబట్టి ఒంటరిగానే పోరాటం చేద్దాం అంటారు. 

610

ఆ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక వేదికగా పవన్ (Pawan Kalyan)మరలా పొత్తులకే అనుకూలం అన్నట్లు సంకేతాలు పంపడం జనసేన వర్గాలకు షాక్ ఇచ్చింది. వాళ్ళ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అన్నారు. అంటే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని పరోక్షంగా చెప్పారు. అయితే ఇటీవల స్పీచ్ లలో పంథా మారింది. పొత్తు పెట్టుకున్నా కానీ సీఎం అభ్యర్థి నేనే అంటున్నారు. ఇది ఆయన సీఎం కావాలని కలలు కంటున్నవారికి ఆనందం కలిగించింది.

710

28 శాతానికి పైగా ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గం పవన్ సీఎం కావాలని గట్టిగా కోరుకుంటారు. అదిగో  మా సామాజికవర్గానికి చెందిన సీఎం పవన్ కళ్యాణ్ అని గొంతెత్తి అరవాలని తహతహలాడుతున్నారు. పవన్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఈ ఎమోషన్ బలంగా ఉంది. వీరి ఎమోషన్ వెనుకున్న రీజన్ కూడా అలాంటిదే. 

810

టీడీపీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి. లోకేష్ విధేయులు, ఎన్టీఆర్ విధేయులు. ఎన్టీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు బీసీ సామాజిక వర్గంలో చాల మంది ఎన్టీఆర్ టీడీపీ సారథి కావాలని ఆశపడుతున్నారు. వైసీపీ రాకతో టీడీపీ ఎన్నడూ లేని స్థాయిలో బలహీనపడింది. కొడుకు కోసం పార్టీ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టాడని బాబుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

910


ఈ క్రమంలో టీడీపీ భవిష్యత్ రధసారధి లోకేష్ కాదు, ఎన్టీఆర్ అంటారు కొందరు. టీడీపీ పార్టీలోని ఎన్టీఆర్ మద్దతుదారులు తాత స్థాపించిన పార్టీకి మనవడు ఎన్టీఆర్ వారసుడు కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్ధులకు గట్టిగా జవాబు చెప్పి పార్టీని నిలబెట్టే సామర్థ్యం ఒక్క ఎన్టీఆర్ కే ఉందని నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు వింటే బాబుకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. 

1010

చివరిగా ప్రభాస్(Prabhas), మహేష్ లాంటి హీరోలకు కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళెవరూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయరు. ఒకవేళ ఆ కోరిక ఉన్నా బయటపెట్టరు. దానికి కారణం వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందింది కాదు. మహేష్ (Mahesh babu)ఫ్యాన్స్ లో  కమ్మతో పాటు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ లో రాజులతో పాటు అనేక సామాజిక వర్గాల వారు ఉంటారు.   
 

Read more Photos on
click me!

Recommended Stories